బాక్సర్ల సేఫ్టీ ప్రధానంగా మార్గదర్శకాలు
టోక్యో (జపాన్) : ఇద్దరు ప్రొఫెషనల్ బాక్సర్లు తలకు బలమైన గాయాలతో మరణించటంతో జపాన్ ప్రొ బాక్సింగ్ అసోసియేషన్ (జేపీబీఏ), జపాన్ బాక్సింగ్ కమీషన్ (జేబీసీ) అప్రమత్తం అయ్యాయి. ఆగస్టు 2న జరిగిన రెండు వేర్వేరు బాక్సింగ్ బౌట్లలో 28 ఏండ్ల ఇద్దరు యువ బాక్సర్లు తీవ్రంగా గాయపడ్డారు. మెదడుకు శస్త్రచికిత్స చేసినా ప్రాణాలు దక్కలేదు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జేపీబీఏ అత్యవసర సమావేశం నిర్వహించింది. బాక్సిర్ల మరణానికి స్పష్టమైన కారణాలు తేలియకపోయినా.. డీహైడ్రేషన్, వేగంగా బరువు తగ్గటం ప్రతికూల ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. బాక్సర్ల సంపూర్ణ ఆరోగ్య సమాచారం తెలుసుకునేందుకు పోటీల సందర్భంగా అథ్లెట్లకు మూత్ర పరీక్షలు నిర్వహించనున్నారు. వెయిట్ విభాగాలు మారే బాక్సర్లకు బరువు తగ్గటంలో కఠిన నిబంధనలు రూపొందించనున్నారు. పోటీలు జరిగే సమయంలో బాక్సింగ్ హాల్ వద్ద అత్యవసర శస్త్రచికిత్స చేయగలిగే స్థాయిలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులో జరిగే మరో కీలక సమావేశంలో జపాన్ అమేచర్ బాక్సింగ్ అసోసియేషన్‌తో పాటు వైద్యులను సైతం భాగం చేయనున్నారు.
జపాన్ బాక్సింగ్‌లో కొత్త రూల్స్
- Advertisement -
- Advertisement -