- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వన్‌టైం రిజిస్ట్రేషన్ విధానంలో కీలక సంస్కరణలు చేపట్టింది. ఇకపై ఉద్యోగ ప్రకటనలకు అభ్యర్థుల అర్హతను కేవలం ఓటీఆర్‌లో పొందుపరిచిన వివరాల ఆధారంగానే నిర్ధారిస్తారు. అభ్యర్థులు తమ ఓటీఆర్‌ను ఏడాదికి రెండుసార్లు అప్‌డేట్ చేసుకోవచ్చు. నమోదు చేసే ప్రతి అర్హతకు సంబంధించిన ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి. తప్పుడు సమాచారం లేదా నకిలీ సర్టిఫికెట్లతో వివరాలు నమోదు చేస్తే ఓటీఆర్‌ను రద్దు చేస్తామని కమిషన్ హెచ్చరించింది.
- Advertisement -



