Tuesday, December 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచ్, వార్డు సభ్యులు

ఎమ్మెల్యేను కలిసిన నూతన సర్పంచ్, వార్డు సభ్యులు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండల కేంద్రంలోని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని జానకం పేట్ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొలిపాక సంతోష్ రెడ్డి, వార్డు సభ్యులు సౌడ రాకేష్, ఎడ్ల ఓపెష్, తలారి గంగాధర్, వేణు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంగళవారం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని స్వగృహంలో  కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిని ప్రశాంత్ రెడ్డి అభినందించి, సత్కరించారు.ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులు సద్వినియోగం చేసుకొని, గ్రామభివృద్ధికి కృషి చేయాలనీ ఎమ్మెల్యే ఆకాక్షించారు.కార్యక్రమం లో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగాధర్ రెడ్డి, నాయకులు సౌడ రమేష్, కొలిపాక శ్రీనివాస్, సత్యం, డైరెక్టర్ శేఖర్, శోభన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -