రామ్ చరణ్, బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రాన్ని వద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కథానాయికగా నటిస్తోంది.
‘పెద్ది’ టీమ్ నేటి (శుక్రవారం) నుండి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంచనుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు, వాటిలో కొన్నింటిని ఢిల్లీలోనూ చిత్రీకరిస్తారు. జనవరి నెలాఖరు వరకు చిత్రీకరణ కొనసాగుతుంది. అప్పటికి సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ప్లానింగ్ ప్రకారం, నిర్మాణ పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి అని చిత్రయూనిట్ తెలిపింది.
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్ర పోషించడం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న పాన్-ఇండియా థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ చిత్రానికి సహ నిర్మాత: ఇషాన్ సక్సేనా, సంగీతం: ఏఆర్ రెహ్మాన్, డీఓపీ : ఆర్ రత్నవేలు, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్.
హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



