బాధల మధ్య కొత్త వాక్య నిర్మాణం
వెలుతురు పందిళ్ల మధ్య వెలిగి
మబ్బు పట్టిన కొండల దారుల నుండి
జాలువారిన తడి
నగరాల మీద నడుస్తున్నది
ముడులు పడ్డ గొంతులు
నినాదాలవుతుంటే
పొగమంచు సమయాల మీదుగా,
గాయపడ్డ ముఖాలు పరేడ్ చేస్తున్నాయి
అడవి అంతా తిరిగి
పుల్లలు వెతికి గూడుకట్టుకున్న పక్షులకు
మనుషుల భుజాలెక్కి కన్నీళ్ల గుసగుసలు వినిపించడం తెలియదా
ఋతువుల రెక్కలెప్పుడూ
కలల్ని వెంటబెట్టుకునే తిరుగుతాయి
భూభ్రమణంలా బాధలు
ఒక దిక్కు నుండి మరో దిక్కు కదులుతాయి
వాలిన పికిలిపువ్వులాంటి సూర్యాస్తమయాలు
మరో చోట ఎర్రటి రేఖల ఉదయాలు
ఆశ విస్ఫోటన అగ్నిపర్వత జ్వాల కొసలమీద
ఎగిరే ఫినిక్స్ పక్షి
తెగిపోయిన పాదరసపు పాదాలు
అతుక్కునే వేళ
తుప్పుపట్టని ఇనుపస్తంభం ఎక్కి నినదిస్తున్నది
వేముగంటి మురళి, 9392256475
కొత్త వాక్యం
- Advertisement -
- Advertisement -



