‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా అలరించిన హీరో తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్, కతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ‘ఇటీవల విడుదల చేసిన సినిమా టీజర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన కథ, ఫాంటసీ యూనివర్స్‌తో ఈ సినిమా సూపర్ హీరో జోనర్‌ని రీ డిఫైన్ చేయబోతుందని ప్రామిస్ చేసింది. అలాగే ఈనెల 26న విడుదలయ్యే ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది..’తో ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్‌లు ప్రారంభం కానున్నాయి. టైటిల్, పోస్టర్ చూస్తుంటే కచ్చితంగా ఓ హై ఎనర్జీ టెక్నో బీట్ సాంగ్ అని అర్థమౌతోంది. లీడ్ పెయిర్ తేజ సజ్జా, రితికా నాయక్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. బ్యాక్‌డ్రాప్‌లో మెరిసే గోల్డెన్ ఎనర్జీ స్పార్క్స్ మ్యాజికల్ ఫీల్ ఇస్తూ, మిరారు మైథో-ఫాంటసీ టచ్‌ను హైలైట్ చేస్తుంది. మనోజ్ మంచు ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నారు. శ్రీయ శరణ్, జయరామ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 2డి, 3డి ఫార్మాట్లలో 8 భాషల్లో థియేటర్లలోకి రానుంది’ అని చిత్ర యూనిట్ తెలిపింది. దీనికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుజిత్ కుమార్ కొల్లి, సంగీతం: గౌర హరి.