ఎండ్లూరి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఎండ్లూరి కళావతి నిర్మిస్తున్న సస్పెన్స్, క్రైమ్ చిత్రం ‘ది బ్రెయిన్’. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకుడు. అజయ్, తన్విక, బేబీ దాన్విత, అజయ్ ఘోష్, శరత్ లోహిత్, జయ చంద్ర నాయుడు, రవి కాలే, జ్యోతి తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు అశ్విన్ కామరాజ్ కొప్పాల మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని క్రైమ్ అండ్ సస్పెన్స్ జోనర్‌లో తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్నాం. ఈ చిత్రానికి మాటలు పోతు గడ్డం ఉమా శంకర్ అందించారు. యూఎస్ విజయ్ కెమెరా మెన్‌గా, ఎంఎల్ రాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి అవుట్ పుట్ అందిస్తున్నారు’ అని అన్నారు.
నయా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



