నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ 2026కు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ ను బుధవారం ప్రకటిస్తూ ఆల్ రౌండర్ మిచెల్ సాంట్నర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 15 మంది ఆటగాళ్లలో సాంట్నర్ తో సహా మొత్తం ఐదుగురు గాయపడిన ప్లేయర్స్ కు ఎంపిక చేసింది. ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ పూర్తిగా ఫిట్ నెస్ సాధించపోయినా ఎంపిక చేసింది. వీరికి పెద్ద గాయాలు కాదని వరల్డ్ కప్ సమయానికి కోలుకుంటారని న్యూజిలాండ్ క్రికెట్ ధృవీకరించింది.
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే వెల్లింగ్టన్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి
ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ జామిసన్
వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ జట్టు ప్రకటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



