Saturday, December 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి

వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో నవజాత శిశువు మృతి

- Advertisement -

డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళన
నవతెలంగాణ-వనస్థలిపురం

హైదరాబాద్‌ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందింది. దాంతో ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకెళ్తే.. వనస్థలిపురంలోని చింతలకుంటలో నివాసం ఉంటున్న గర్భిణి సమీనా ఈనెల 3న ప్రసవం కోసం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో చేరింది. శుక్రవారం తెల్లవారుజామున మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఏమైందో ఏమో నవజాత శిశువు మృతిచెందింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ శిశువు మతిచెందాడని ఆరోపిస్తూ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణ మాట్లాడుతూ.. శిశువు చనిపోవడం వాస్తవమేనని, దానిపై ఒక కమిటీ వేసి.. ఘటనపై విచారణ జరిపి.. చర్యలు తీసుకుంటామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -