Sunday, December 14, 2025
E-PAPER
Homeజిల్లాలుకొలువుదీరనున్న కొత్త సర్పంచులు

కొలువుదీరనున్న కొత్త సర్పంచులు

- Advertisement -

డిసెంబర్ 20న బాధ్యతలు స్వీకరణ
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలంలోని 16 గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు డిసెంబర్ 20న అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన అపాయింటెడ్ డేను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడత జరిగిన ఈనెల11న నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న సర్పంచులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం గ్రామ పాలన బాధ్యతలను చేపట్టనున్నారు. 16 గ్రామ పంచాయతీల సర్పంచులుగా బైరాంనగర్ కంపరాజు వెంకటేశ్వరరాజు, కొలనుపాక బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, రాఘవపురం పరిదె మమత సంతోష్, పటేల్ గూడెం గ్యార కుమారస్వామి, శ్రీనివాసపురం వడ్ల శోభన్ బాబు, గుండ్లగూడెం ఏసి రెడ్డి మంజుల మహేందర్ రెడ్డి, సాయి గూడెం గ్యార కవిత సంపత్, మందనపెల్లి సిరిమర్తి రేణుక నరసయ్య, టంగుటూరు జూకంటి అనిల్ కుమార్, కొల్లూరు జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి, శారాజి పేట కంతి మధు, తూర్పు గూడెం దూపటి లక్ష్మీ వెంకటేష్, గొలనుకొండ ఇందూరి యాదిరెడ్డి, శర్బనాపురం మొగలిగాని నర్సయ్య, మంతపురి పసుల సతీష్ రెడ్డి, కందిగడ్డ తండ మాలోతు బోరిలాల్ బాధ్యతలు స్వీకరించరున్నారు.

వీరితోపాటు 16 గ్రామ పంచాయతిల ఉప సర్పంచ్ కూడా బాధ్యతలు చేపడతారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సమస్యలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై నూతన సర్పంచులు దృష్టి సారించనున్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.

గ్రామ సభలను క్రమం తప్పకుండా నిర్వహించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని, పారదర్శకమైన పాలన అందించడమే తమ లక్ష్యమని సర్పంచులు పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులు, కూలీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని, గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపేందుకు సమిష్టి కృషి అవసరమని తెలిపారు. నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణతో ఆలేరు మండలంలోని గ్రామ పాలనలో కొత్త ఉత్సాహం నెలకొంటుందని, ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -