నవతెలంగాణ – మునిపల్లి
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు మూలస్తంభాలని మేళాసంఘం గ్రామ సర్పంచ్ కుప్నాగారం లక్ష్మీ సంగమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆమె నవతెలంగాణ దినపత్రిక వార్షిక కాలమానిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ సంగమేశ్వర్ మాట్లాడుతూ.. నిత్యం అక్షర తూటాలతో ఎన్నో శీర్షికలతో నవతెలంగాణ దినపత్రిక అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తున్నదని ఆమె కొనియాడారు. ఎన్నో ప్రజా సమస్యల పరిష్కార దిశగా నవతెలంగాణ దినపత్రిక అడుగులు వేస్తోందని లక్ష్మీ సంగమేశ్వర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నవతెలంగాణ దినపత్రిక విలేకరి నర్సిములు (థామస్) ను ఆమె సన్మానించారు. ఈ సమావేశంలో మండల పరిషత్ మాజీ అధ్యక్షులు రాంరెడ్డి, ఉపాధ్యక్షులు గౌ రెడ్డి గారి నారాయణరెడ్డి ఉప సర్పంచ్ బేగరి అంజయ్య , నాయకులు ఖ్యాతం రవీందర్, మాణిక్యప్ప, బేగారి మొగులమ్మ, మల్లేశం వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలు మూలస్తంభాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



