Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందన

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పందన

- Advertisement -

పిటిషనర్‌కు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సమాచారం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. ఎలాంటి పర్యావరణ నష్టాన్ని అంచనా వేయకుండా ప్రభుత్వం ఇష్టానురీతిగా ప్రకృతిని నాశనం చేసిం దని న్యాయవాది ఇమ్మనేని రామారావు గతంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. ప్రభుత్వ చర్యలతో 27 ఎకరాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సు, 134.28 ఎకరాల షీట్‌ రాక్స్‌, 2.33 ఎకరాల కుంటకు నష్టం వాటిల్లిందని అందులో పేర్కొన్నారు. తద్వారా ఆయా ప్రాంతంలో జీవిస్తోన్న అంతరించిపోయే జాతికి చెందిన నక్షత్ర తాబేళ్లు, జింకలు, నెమళ్లు, ఇతర జీవ జాతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెల్లడించింది. ఈ వ్యవహారంలో కేసు నమోదు (823/36/9/2025) చేసినట్టు ఫిర్యాదుదారుడు ఇమ్మనేని రామారావుకు గురు వారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సమాచారం అందించింది. ఈ కేసు లో భవిష్యత్‌లో వాదనలు వినిపించవచ్చని అందులో పేర్కొన్నట్టు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img