Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నైట్ డ్యూటీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి

నైట్ డ్యూటీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

– ఎం.సుధాకర్ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
నవతెలంగాణ – కామారెడ్డి

కేజీబీవీలో నైట్ డ్యూటీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో డీఈఓ కు వినతిపత్రం అందించారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న అకౌంటెంట్లకు, వర్కర్లకు నైట్ డ్యూటీలు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా డీఈవో రాజు కు వినతిపత్రం ఇవ్వడం జరిగిందనీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీ అకౌంటెంట్లకు నైట్ డ్యూటీలు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేజీబీవీలు విజయవంతంగా నడవడంలో టీచింగ్ సిబ్బందితోపాటు అంతకన్నా ఎక్కువ నాన్ టీచింగ్ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. టీచింగ్ సిబ్బందితో పోలిస్తే  నాన్ టీచింగ్ , వర్కర్లకు అతి తక్కువ వేతనాలు ఉన్నాయన్నారు. కాలేజీలుగా అప్ గ్రేడ్ అయిన కేజీబీవీల్లో పనిభారం విపరీతంగా పెరిగిందన్నారు. 
హెచ్ఎంఎస్  విధానంతో అకౌంటెంట్లు  పనిఒత్తిడికి గురవుతున్నారన్నారు. కేర్ టేకర్లను నియమించాలనీ, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే,  వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోగా, అదనంగా నైట్ డ్యూటీలు చేయాలని ఉత్తర్వులు ఇవ్వడం వారిని మరింత ఆందోళనకు గురిచేసిందన్నారు. అకౌంటెంట్లకు ఫైనాన్షియల్ సంబంధమైన విధులు ఉంటాయనీ, అకాడమిక్ బాధ్యతలు టీచింగ్ సిబ్బంది చూస్తారన్నారు. అకౌంటెంట్లకు విద్యార్థులతో ప్రత్యక్ష అనుబంధం పెద్దగా ఉండదనీ, అయినప్పటికీ వారికి నైట్ డ్యూటీ కేటాయించడం ఏ విధంగానూ ఉపయోగకరం కాదన్నారు.  అందువల్ల అకౌంటెంట్లకు నైట్ డ్యూటీలు వేయాలని ఇచ్చిన ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఇప్పటికే తీవ్ర పనిభారాన్ని మోస్తున్న వర్కర్లకు  నైట్ డ్యూటీలు వేయడం అన్యాయమన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వర్కర్ల పోస్టులు లేకపోవడంతో, ఉన్న వర్కర్లకే పనిభారం పెరిగి మానసిక, శారీరక అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు. పనికి తగ్గ వేతనం  అందడం లేదన్నారు. వారికి ఓదార్పు లేకపోగా, నైట్ డ్యూటీలు చేయమనడం బాధాకరమన్నారు. 
అకౌంటెంట్లకు, వర్కర్లు నైట్ డ్యూటీ  చేయాలన్న ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిచో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు ప్రకాష్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు సురేష్, కేజీబీవీ అకౌంటెంట్లు శశికళ, మమత, రజియా, స్వరూప, హిమవర్ష, భవాని , నవనీత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -