Wednesday, January 7, 2026
E-PAPER
Homeఆటలునిఖత్‌ జరీన్‌ అలవోకగా..

నిఖత్‌ జరీన్‌ అలవోకగా..

- Advertisement -

మీనాక్షి, లవ్లీనా శుభారంభం
జాతీయ బాక్సింగ్‌ పోటీలు

గ్రేటర్‌ నోయిడా : స్టార్‌ బాక్సర్లు నిఖత్‌ జరీన్‌, మీనాక్షి, లవ్లీనా బొర్గొహైన్‌లు జాతీయ ఎలైట్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేశారు. మహిళల 48-51 కేజీల విభాగంలో తెలంగాణ తరఫున బరిలోకి దిగిన నిఖత్‌ జరీన్‌ 5-0తో చంఢగీడ్‌ బాక్సర్‌ నిధిపై అలవోక విజయం సాధించింది. 45-48 కేజీల విభాగంలో మీనాక్షి సైతం 5-0తో తమిళనాడు బాక్సర్‌ లక్ష్య విజయన్‌ను చిత్తు చేసింది. 70-75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గొహైన్‌ కాస్త తడబడినా..కృష్ణ వర్మపై క్లీన్‌ విక్టరీ నమోదు చేసింది. పురుషుల విభాగంలో సాగర్‌, అర్ష్‌ప్రీత్‌ సింగ్‌, హితేశ్‌, సచిన్‌, అంకుశ్‌లు తొలి రౌండ్లో విజయాలు సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -