Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వనదేవతలను దర్శించుకున్న నీమ్స్ సిబ్బంది .. 

వనదేవతలను దర్శించుకున్న నీమ్స్ సిబ్బంది .. 

- Advertisement -

నవతెలంగాణ – తాడ్వాయి : మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను శనివారం దర్శించుకున్నారు. ఎండోమెంట్ అధికారులు, పూజారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. జంపన్న వాగులో పుణ్య స్థానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకుని సమ్మక్క- సారలమ్మ, పగిడిదిరాజు, గోవిందరాజు వనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారే సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. అనంతరం పూజారులు ఎండోమెంట్ అధికారులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

మొదట మేడారంలోని చిలకలగుట్ట, జంపన్న వాగు, సార్లమ్మ ఆలయం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, శివరాం సాగర్ చెరువు, తదితర భక్తులు అధికంగా ఉండే ప్రదేశాలను తిరిగి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడారంలో ప్రకృతిలో వనదేవతలను దర్శించుకోవడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని అన్నారు. కోరిన మొక్కులు తీర్చే సమ్మక్క సారలమ్మ జాతర్లకు ఇప్పటినుండి భక్తుల సందడి మొదలైంది అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నిమ్స్ సిబ్బంది సతీష్ పోతురాజు, జి రాజన్న, పి ఆంజనేయులు, బండ్ల శ్రీకాంత్, ఆర్ సందీప్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -