- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ చోటు సంపాదించారు. ఏకంగా 10సార్లు బిహార్ సీఎం కావడంతో ఆయనకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బ్రిటన్ రాజధాని లండన్‌లోని ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి సీఎం నీతీశ్‌కు ఒక ప్రశంసా పత్రం అందింది. నీతీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా చారిత్రక రికార్డును సృష్టించారని తెలిపింది.
- Advertisement -



