Tuesday, December 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పసుపులో నత్రజని, జింక్ పోషక లోపం

పసుపులో నత్రజని, జింక్ పోషక లోపం

- Advertisement -

– రైతులు నివారణ చర్యలు చేపట్టాలి- ఎంఏవో రమ్యశ్రీ 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా పసుపు పంటలో నత్రజని, జింక్ పోషక లోపం కనిపిస్తుందని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ తెలిపారు. మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ పసుపు పంటలో మొక్క మధ్య ఆకులు పసుపు రంగులోకి మారి మోడు బారుతుండడంతో ఆందోళనతో వ్యవసాయ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలో మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ స్పందిస్తూ పసుపు ఆకులు పసుపు రంగులోకి మారి, మోడు బారడానికి కారణం నత్రజని, జింక్ పోషక లోపం వల్ల జరుగుతుందని తెలిపారు. నత్రజని, జింక్ పోషక  లోపం నివారణకు వర్షాలు తగ్గిన తరువాత 10 కిలోల జింక్ సల్ఫేట్, యూరియా 25 కిలోలలు కలిపి ఎకరానికి చల్లడం వల్ల నివారించవచ్చని తెలిపారు. పసుపు రైతులు ఇలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సందేహాలు సలహాల కోసం వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -