నవతెలంగాణ – కంఠేశ్వర్ : బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన రోజు మండల్ డే గా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న నిర్వహించే జాతీయ మహాసభలను ఈ ఏడాది గోవా రాష్ట్ర రాజధాని పనాజీలో ఘనంగా నిర్వహించారు. ఈ జాతీయ మహాసభలో నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున దాదాపు 50 మంది బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పాల్సినది ఇదే సరైనా సమయం అన్నారు.
ఈ నేపధ్యంలో హక్కుల కొరకు పారాడక పోతే రాబోవు తరాలకు మనం అన్యాయం చేసిన వారిమి అవుతామన్నారు. కులగణనను కేంద్రం వెంటనే ప్రారంభించి, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల కొరకు చేసిన ఆర్డినెన్స్ ను ఆమోదించాలని డిమాండ్ చేసారు. జాతీయ ఓబీసీ మహాసభల్లో క్రమం తప్పకుండా పాల్గొనడం గర్వంగా ఉందని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం సాధిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్, ఆకుల ప్రసాద్, మాడవేడి వినోద్, నారాయణరెడ్డి పటేల్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, చంద్రకాంత్, బగ్గలిఅజయ్, బసవరాజు, పల్లికొండ అన్నయ్య, కోడూరు స్వామి, మహేష్, నర్సయ్య, నాగరాజ్, గోవర్ధన్, శ్రీనివాస్, జయ, అపర్ణ, బాబు, శేఖర్, గణేష్, విశాల్ తదితరులు పాల్గొన్నారు.