నవతెలంగాణ-హైదరాబాద్: అర్జెంటీనా ఫుట్‌బాటల్ దిగ్గజం లియోనెల్ మెస్సి (Lionel Messi) ‘గోట్ ఇండియా టూర్’ నిర్వాహకుడు శతద్రు దత్తా (Satadru Dutta)కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు ఆయనను 14 రోజుల కస్టడీకి తీసుకున్నారు. శనివారం తొలిరోజు పర్యటనలో భాగంగా సాల్ట్‌లేక్ స్టేడియానికి మెస్సి వచ్చారు. అయితే చెప్పిన సమయం కంటే అతి తక్కువ సమయం గడపటం, చూసేందుకు అవకాశం లేకపోవడంతో మెస్సి అభిమానులు రెచ్చిపోయారు. సీసాలు, ప్లాస్టిక్ కూర్చీలు స్టేడియంలోకి విసిరేయడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఆదివారంనాడు స్డేడియంను పరిశీలించింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తోంది. ఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. కాగా, మెస్సి తొలిరోజు పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పర్యటించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డితో పుట్‌బాల్ ఆడారు. పలువురు పిల్లలు కూడా పాల్గొన్నారు. రెండో రోజైన ఆదివారంనాడు ముంబైలోని వాంఖెడే స్టేడియంలో అభిమానులను మెస్సి కలుసుకున్నారు.



