Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మంత్రివర్గంలో నోచాన్స్..రాజీనామా చేస్తాను

మంత్రివర్గంలో నోచాన్స్..రాజీనామా చేస్తాను

- Advertisement -

అనుచరులతో సుదర్శన్ రెడ్డి మాట 
మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో తీవ్ర సంతృప్తి 
బుజ్జగించేందుకు సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి చోటు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. రెండో విడత మంత్రివర్గం విస్తరణలో సామాజిక కూర్పు నేపథ్యంలో ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వగా అందులో తన పేరు లేకపోవడంతో ఆయనను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉమ్మడి జిల్లా నుంచి గత 18 నెలలుగా మంత్రి పదవిపై సుదర్శన్ రెడ్డి ఆశ పెట్టుకున్నారు. కాగా, రెడ్డి సామాజిక వర్గానికి ఇదివరకే నలుగురికి మంత్రి పదవులు ఉండడంతో సామాజిక సమీకరణాల కారణంగా ఇతర నేతలు ఒత్తిడితో మంత్రి పదవి మిస్ అవుతోంది. రెండో విడత మంత్రివర్గ జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి తో తనకు మంత్రి పదవి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అనుచరులతో అన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధినాయకత్వం సుదర్శన్ రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్లు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు, సుమారు గంటపాటు బుజ్జగింపులు జరగగా సరిగా ఎవరితో మాట్లాడలేదని తెలుస్తోంది. సామజిక వర్గాల సమీకరణలు తర్వాత మూడో విడతలో అవకాశం ఇస్తారని హామీ ఇచ్చినట్టు సమాచారం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad