Thursday, November 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంహామీలు కాదు…కార్యాచరణ అవసరం

హామీలు కాదు…కార్యాచరణ అవసరం

- Advertisement -

వాతావరణ మార్పులపై లూలా

బెలెమ్‌/సావో పాలో (బ్రెజిల్‌) : ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై ఈ నెలలో అమెజాన్‌లో జరగబోయే సదస్సు (కాప్‌30) గ్లోబల్‌ వార్మింగ్‌కు వాస్తవ పరిష్కారాలు సూచిస్తుందని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాసియో లూలా డ సిల్వా తెలిపారు. సదస్సు సందర్భంగా ఆయన అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దశాబ్ద కాలం క్రితం కుదుర్చుకున్న పారిస్‌ ఒప్పందం ప్రకారం గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌ దాటనీయరాదని పలు దేశాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. అయినప్పటికీ ఇప్పుడది 2.3-2.5 సెల్సియస్‌ డిగ్రీలుగా నమోదవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కర్బన్‌ ఉద్గారాలు చాలా అధికంగా ఉన్నాయని, గ్లోబల్‌ వార్మింగ్‌ను అడ్డుకోవడం సాధ్యం కావడం లేదని ఐరాస హెచ్చరించింది.

ఉద్గారాలను తగ్గించుకుంటామని ఇచ్చిన హామీని వివిధ దేశాలు నెరవేర్చాల్సి ఉంటుందని, లేనిపక్షంలో ప్రపంచం మరింత వేడెక్కుతుందని, దానిని తిరిగి సాధారణ స్థితికి తేవడం చాలా కష్టమని యూఎన్‌ఈపీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లూలా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నెల 10-21 తేదీల మధ్య బ్రెజిల్‌లో కాప్‌30 జరుగుతుంది. వాతావరణ మార్పులపై కొత్తగా హామీలు ఇవ్వడానికి బదులు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంపై దృష్టి సారించాలని లూలా ప్రపంచ దేశాలకు సూచించారు. పారిస్‌ ఒప్పందానికి కొన్ని దేశాలు కట్టుబడి ఉండడం లేదని ఆయన తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో వాతావరణ సదస్సు ప్రాధాన్యతను కోల్పోతుందని లూలా అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -