Thursday, July 3, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు: ఎమ్మెల్సీ కవిత

బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జులై 17న రైల్‌ రోకోకు పిలుపునిచ్చామని బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామన్న సీఎం ఇంకా స్పందించలేదన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని పేర్కొన్నారు. బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఖర్గేకు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ‘‘జులై 8 లోపు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్‌లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్‌ సహకరిస్తోంది. గోదావరి-బనకచర్ల విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోంది’’ అని కవిత అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -