సుప్రీంలో పంజాబ్ వాదనలు
నేడు కొనసాగనున్న విచారణ
న్యూఢిల్లీ : రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు కాల పరిమితులు విధించవచ్చా లేదా అనే అంశంపై రాష్ట్రపతి పంపిన ప్రస్తావనపై సుప్రీంకోర్టు మంగళవారం కూడా తన విచారణను కొనసాగించింది. 200, 201 అధికరణల కింద గవర్నర్ల విచక్షణ యొక్క రాజ్యాంగ పరిధిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవారు నేతృత్వాన గల ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తోంది. గవర్నర్లకు అనర్హమైన వీటో వుండదని, వారు తక్షణమే, సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాల్సి వుంటుందని కర్ణాటక, కేరళ ప్రభుత్వాల తరపున వరుసగా తమ వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియన్, కె.కె.వేణుగోపాల్‌లు స్పష్టం చేశారు. అంతేగానీ తమకు వీలైనపుడు చర్యలు తీసుకోరాదని పేర్కొన్నారు. గవర్నర్లు నిరవధికంగా బిల్లులకు ఆమోద ముద్ర వేయకుండా జాప్యం చేయలేరని తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరపున పలువురు న్యాయమూర్తులు గత సెషన్‌లో (సెప్టెంబరు 2) విచారణ సందర్భంగా స్పష్టం చేశారు. దాని ఆధారంగా ఈ మంగళవారం విచారణ ప్రారంభమైంది. బుధవారం కూడా విచారణ కొనసాగనుంది.
మళ్ళీ సమాధానం అనవసరం
ప్రస్తుత రాష్ట్రపతి ప్రస్తావనలో లేవనెత్తిన రాజ్యాంగపరమైన అంశాలన్నింటికీ తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు సమాధానమిచ్చేసిందని, మళ్ళీ కొత్తగా ఈ ప్రస్తావనకు సమాధానాలివ్వడం అనవసరమని పంజాబ్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది అరవింద్ దతార్ చెప్పారు. రాజ్యాంగం సమర్ధవంతంగా పనిచేయ డానికి, ప్రజా విశ్వాసాన్ని పరిరక్షిం చుకోవ డానికి కాలపరిమితులు విధించు కోడం ముఖ్యమైనపుడు సుప్రీం కోర్టు వాటిని విధించవచ్చని అన్నారు. సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ప్రతీ కేసూ అనేక ప్రశ్నలను లేవదీస్తుందని, వాటన్నింటినీ ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లే విచారించాలా? అని ఆయన ప్రశ్నించారు.
మళ్లీ సమాధానం అనవసరం
- Advertisement -
- Advertisement -