నవతెలంగాణ-హైదరాబాద్: తాను క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘ఆపరేషన్ సింధూర ప్రారంభంలో పాక్ బలగాలు.. భారత విమానాలను కూల్చివేశాయని, తద్వారా భారత వైమానిక దళం వెనక్కి తగ్గిందంటూ పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశం అధికార బీజేపీకి ఆయుధంగా మారింది.
ఆపరేషన్ సింధూర్ అనేది గత ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన సైనిక చర్య. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పీఓకేలోని సుమారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం మట్టుబెట్టింది. ఈ పోరులో పాక్ నాలుగు ఫైటర్ జెట్‌లను కోల్పోయిందని, వారి సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది.



