- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై రాజకీయ పార్టీలు ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదులు గానీ అభ్యంతరాలు సమర్పించలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఓటర్ల జాబితా ప్రకటించిన దగ్గర ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదని పేర్కొంది.
జూలై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీహార్‌లో జరుగుతున్న ఓట్ల ప్రత్యేక సర్వేపైనే సభలో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే ఈ ఆరోపణలను ఈసీ ఖండించింది. అనర్హులైన ఓటర్ల పేర్లనే తొలగిస్తున్నట్లు తెలిపింది.
- Advertisement -