Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్లాస్టిక్ వద్దు..మోదుగు ఆకులే మేలు

ప్లాస్టిక్ వద్దు..మోదుగు ఆకులే మేలు

- Advertisement -

నవతెలంగాణ – దుబ్బాక : మనిషికి క్యాన్సర్ తో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని.. ఇళ్లలో, ఫంక్షన్లలో ప్లాస్టిక్ గ్లాసులు, కప్పులు, ప్లేట్ల బదులు ప్రకృతి పరంగా లభించే మోదుగు ఆకులను వినియోగించాలని పంచాయతీ కార్యదర్శి మురళి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి గ్రామపంచాయతీ వద్ద డ్వాక్రా మహిళలచే తయారు చేయబడ్డ మోదుగు విస్తారాకుల ప్రాముక్యాన్ని తెలుపుతూ వాటి ఉత్పత్తులను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్, డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -