Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నో టెన్షన్ అన్న .. ఓటు నీకే

నో టెన్షన్ అన్న .. ఓటు నీకే

- Advertisement -

ఉపశమనం కలిగిస్తున్న ఓటర్లు..
హామీలు ఇస్తున్న అభ్యర్థులు  
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. సర్పంచ, వార్డు మెంబర్‌గా ఒక్క ఓటు తేడాతే ఓడిపోయిన అభ్యర్థులు చాలానే ఉన్నారు. దీంతో ఇంటింటి ప్రచారంతో పాటు ఓటర్లను అభ్యర్థులు ఆకర్షిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గం లోని నసురుల్లాబాద్, బీర్కూర్, బాన్సువాడ, మండలాల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడవ విడతలో జరగనున్నాయి. నామినేషన్ పక్రియ ముగిసింది. నసురుల్లాబాద్ మండలంలో 19 గ్రామ పంచాయతీలకు గాను 164, బీర్కూర్ మండలంలో 13 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు గాను 114 వార్డులకు , బాన్సువాడ మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉండగా 222 గ్రామ వార్డులు ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమదైన శైలిలో ఓటర్లను తమవైపు తిప్పుకుంటున్నారు.

సోమవారం రాత్రి నుంచి మందు, విందు రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తాగినోళ్లకు తాగినంత, తిన్నోళ్లకు తిన్నంత అన్నట్టు సాగుతోంది. ఇక కుల సంఘాలు, యూత్ సంఘాలు సభ్యులతో సమావేశాలవుతున్నారు. ఓటర్ల నుంచి హామీ తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఓట్లు తీసుకుంటున్నారు. మీ కుల సంఘం ఓట్లు తమకే వచ్చే విధంగా చూడాలని సంఘ పెద్దలకు బాధ్యతలు చెప్పుతున్నారు. లీడర్లకు నజరానా ఇస్తూ గ్రామంలో ప్రత్యర్థికి ధీటుగా డబ్బు మద్యం ముట్ట చెబుతున్నారు. ఓట్లను చే జారకుండా చూడాలని గల్లీ నాయకులకు బాధ్యతలు ఇస్తున్నారు.

అభ్యర్థులకు ఉపశమనం కలిగిస్తున్న ఓటర్లు..
గత రెండు రోజులుగా ఇంటి చుట్టూ, గల్లీల్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ అన్న నీ ఓటు నాకే వెయ్యాలని అభ్యర్థించడంతో పలు గ్రామాల్లో ఓటర్లు ఎందుకు టెన్షన్ తీసుకోక మా ఓటు మీకే వేస్తామని అభ్యర్థులను ఉపశమనం కలిగిస్తున్నారు. మరి కొందరు విసుగు చెందిన ఓటర్లు సమాధానం చెప్పలేక మా ఓటు మీకే అన్న ఈసారి వేస్తాం బాధపడకు అన్నా అంటూ అభ్యర్థులకు ఉపశమనం కల్గిస్తున్నారు. దీంతో మీ కుల సంఘానికి, యువత కు ఏమి ఇవ్వాలనేది పలానా వ్యక్తి అన్ని చూసుకుంటాడు. అని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఓట్లు వేయించే బాధ్యత గల్లీ లీడర్ దే బాధ్యత అంటూ ఎన్నికల నిఘా అధికారులకు తెలియ కుండా తాయిలాలు బయటకు పొక్కకుండా చూస్తూ అభ్యర్థులు జాగ్రత్త వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -