ప్రతిపాదించిన ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు
అప్పుడు పాక్, ఇప్పుడు ఇజ్రాయిల్
అమెరికా అధ్యక్షుడ్ని బుట్టలో వేసుకోవటానికే :రాజకీయ విశ్లేషకులు
వైట్ హౌస్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ఇజ్రాయిల్ ప్రతిపాదించింది. ట్రంప్ పేరును నామినేట్ చేస్తూ నోబెల్ బహుమతి కమిటీకి లేఖ పంపినట్టు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు తెలిపారు. సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలో ఆయన ట్రంప్‌కు ఈ విషయాన్ని తెలియజేస్తూ కమిటీకి రాసిన లేఖ కాపీని అందజేశారు.
శాంతి బహుమతికి నామినేట్
”అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే గొప్ప పనులు చేశారు. మనం మాట్లాడుతుండగానే ఆయన ఒక దేశంలో ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతున్నారు. అందుకే నోబెల్ బహుమతికి కమిటీకి పంపిన లేఖను మీకు అందించాలనుకుంటున్నా. ఇది శాంతి బహుమతికి మిమ్మల్ని నామినేట్ చేస్తోంది. ఇది అర్హమైనది. తప్పనిసరిగా ఈ పురస్కారం మీకు దక్కుతుంది. ఇక ట్రంప్ నాయకత్వం, న్యాయమైన లక్ష్యం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఎంతో గొప్పవి. పశ్చిమాసియాలో శాంతి భద్రతల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఇజ్రాయిలీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభినందిస్తున్నారు. సవాళ్లను ఎదుర్కోవడానికి, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇరుదేశాలు కలిసి పనిచేస్తాయని భావిస్తున్నా’ అని నెతన్యాహు పేర్కొన్నారు.
నోబెల్‌కు ట్రంప్ పేరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES