ప్రపంచంలోనే అత్యున్నతమైన అనధికార అవార్డుగా పరిగణించబడుతున్నది నోబెల్. పురస్కారాలు దక్కించుకున్నవారు అమిత గౌరవాదరణలు చూర గొంటారు. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా పరిగణించబడే ఈ అవార్డులు కేవలం సేవా, ప్రతిభ పరి శోధన ఆధారంగానే ఇవ్వబడతాయని చెప్ప గలమా? అంటే ఎంతమాత్రం కాదు. శాంతి బహుమతి పొందిన వారిలో ఇదివరకటి ఇజ్రాయిల్ అధినేత మోనాచెన్ బెగిన్, అమెరికాకు లొంగిపోయిన ఈజిప్టు అధినేత అన్వర్ సాదత్ కూడా వున్నారంటేనే ఈ సంగతి తెలుస్తుంది. అలాగే హెన్రీ కిసింజర్, ఒబామా వంటివారికీ నోబెల్ దక్కింది. గతం అలా వుంచి ఈసారి చూసినా అమెరికా అధ్య క్షుడు అరాచాకానికి, అప్రజాస్వామిక పోకడలకూ పేరు మోసిన డోనాల్డ్ ట్రంప్ తనకే నోబెల్ రావాలని చిన్న పిల్లాడిలా మారాం చేశాడు. భారత్-పాక్‌లతో సహా వివిధ దేశాల మధ్య యుద్ధాలు ఆపేయించానని ఆయన గొప్పలు పోయాడు.
అదేం లేదని మోడీ సర్కారు ప్రతినిధులు తోసిపుచ్చుతున్నా పదేపదే తన ప్రచారం కొనసాగిస్తున్నాడు ట్రంప్. ఇందుకుగాను మోడీ లేదా సీనియర్ నాయకులు అసంతృప్తి వెలిబుచ్చి అభిశం సిస్తారా? అదేం జరగడం లేదు. గాజాకు సంబంధించి ట్రంప్ హడావుడి గా ప్రతిపాదించిన శాంతి పథకాన్ని మోడీయే మొట్ట మొదటగా సమర్థించారు. కానీ ఆయన కూడా నోబెల్ బహుమానం కోసం ట్రంప్ లాబీయింగ్‌ను సమర్థించలేక పోయారు. కానైతే మేము ట్రంప్‌తోనే వున్నామని చెప్పుకోవడానికి కొన్ని సందేశాలు పంపిం చడం చేశారు. గాజా విషయంలో అమెరికాకు సంప్ర దాయ స్నేహితులైన ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లండ్ వంటివే సమర్థించలేదు. ఆయనకు నోబెల్ కోసమూ సిఫార్సు చేయలేదు. చివరి నిమిషంలో మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతు ప్రకటించారు. కానీ అప్పటికే ఎంపిక జరిగిపోయింది.
వెనిజులాకు వెన్నుపోటు
నోబెల్ బహుమానం ట్రంప్‌నకు గాక వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కారిచో మచాడో కు అందించినా ఆమె దాన్ని ఆయనకే అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. మరియా అమెరికా పౌరసత్వం తీసుకుం టారని కూడా మరో ప్రచారం బలంగానే జరిగింది. వెనిజులాలో చావేజ్ నాయకత్వాన ప్రత్యామ్నాయ శక్తులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అమెరికా ప్రత్యక్ష జోక్యంతోనే ప్రతీఘాత శక్తులు కుట్రలకు పాల్పడ్డాయి, ఇందులో సైనికాధికారులతోపాటు ప్రతిపక్షనేతలు కొందరు, ముఖ్యంగా కొన్ని సంఘాల నాయకులు పాత్ర వహించారు. మరియా వారిలో ముఖ్యమైన వ్యక్తిగా ఎన్ని కల్లో పోటీకి అర్హత కోల్పోయారు. ప్రజాస్వామ్య ప్రభు త్వాన్ని కూలదోసేందుకు విదేశీ సామ్రాజ్యవాదులతో కలసి అడుగులేసిన ఆమె ప్రజాసామ్య యోధురాలు అనడం లోనే అసలు రహస్యం వుంది. శాంతిదూత భంగిమ దాల్చిన ట్రంప్ వాస్తవానికి హెచ్చరికలు జారీ చేసి మరీ వెనిజులాపై దాడికి యుద్ధనౌకలు పంపారు. వాటిని మరియా స్వాగతించారు కూడా. ఆమెను నోబెల్ వరించడం వెనక ఈ రాజకీయాలన్నీ వున్నాయి. కాకుంటే ముందునుంచీ ట్రంప్ చుట్టూ చర్చతిప్పారు గనక ఆయనకు రాకపోవడం, ఈమెకు రావడం విశేషంగా ప్రచారమైంది.ఇది పథకం ప్రకారం సాగించిన డైవర్షనే.
సాహిత్య నోబెల్ రహస్యం
ఇక సాహిత్య నోబెల్ కూడా రాజకీయ రంగుతోనే నిర్ణయమయ్యే రివాజు మళ్లీ వచ్చినట్టే కనిపిస్తుంది. గతంలో అంటే అమె రికా ఆరంభించిన ప్రచ్చన్న యుద్ధ కాలంలో నాటి సోవియట్, లేదా చైనాలలోని అసమ్మ తివాద రచయితలకు ఆ వ్యవస్థను వ్యతిరే కించే వారికి వెతికి మరీ నోబెల్ ప్రకటించేవారు. డాక్టర్ జివావో వంటి రచనలు చేసిన బోరిస్ పాస్టర్‌నాక్‌కు 1958లోనే నోబెల్ ప్రకటించినప్పుడే అది మొదలైంది, తర్వాత దాన్ని హాలివుడ్‌లో సినిమా తీశారు. తర్వాత కూడా కమ్యూనిస్టు వ్యతిరేక రచయిత అలెగ్జాండర్ సోల్జెనిత్సిన్‌కే ఇచ్చారు. వారు ఎంత గొప్ప రచయితలనేది ఇక్కడ కీలకం కాదు. బహుమతి ప్రదాతల కొలబద్దలేమి టనేది తెలిపే విషయం. వీరిలో చాలామంది తర్వాత అమెరికాలోనే స్థిరపడ్డారు. నాటి జెకోస్లోవేకియాలోనూ వాక్లావ్ హావెల్ వంటి రచయితను ప్రత్యేకంగా ప్రచారమిచ్చి పైకి లేపారు.సోషలిజం విచ్చిన్నమైన తర్వాత అతను ఆ దేశ అధ్యక్షుడు కూడా అయ్యాడు. తూర్పు యూరప్‌లో పోలండ్‌లో సాలిడారిటీ పేరిట స్వంత సంస్థ పెట్టుకుని సోషలిజంపై కత్తి కట్టిన లెచ్ వాలేసాకు నోబుల్ ఇచ్చారు. తర్వాత ఆయనా ఆ దేశాధ్యక్షుడైనాడు. వీరంతా నిజంగా తర్వాత కాలంలో తమ దేశాలను ఏ మేరకు బాగు చేశార నేది కాదు, ఆ దేశాలే ముక్కచెక్కలైనాయి. ఆస్కార్ అవార్డుల్లోనూ ఇది గట్టిగానే కనిపిస్తుంటుంది.
అయితే సరళీకరణ తర్వాత ప్రజల ఉద్యమాలు పెరగడంతో అనివార్యంగా కొందరు ప్రత్యామ్నాయ రచయితలకు ఇచ్చారు. గత పాతికేండ్లలోనూ ఆ విధమైన ఉదాహరణలు కొన్ని వున్నాయి. కానీ ట్రంప్ హయాంలో మళ్లీ పాతపద్ధతులకే తిరిగిపోవడం మొదలెట్టారు. ఈసారి హంగరీలో మొదటి నుంచి కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్న లాస్లో క్రన్నహోర్కారు వంటి రచయితను ఏరికోరి ఎంపిక చేశారు.తూర్పు యూరప్ ప్రతికూల పరిణామాలకు బోణీ కొట్టిన దేశమే హంగరీ. చరిత్రలో ఫాసిస్టు తరహా పోకడలు కూడా మొదట అక్కడ ఎక్కువ.తమాషా ఏమంటే ఇతర దేశాలలో తలదూర్చి తను చెప్పినట్టు నడవాలని శాసిస్తున్న ట్రంప్ స్వేచ్ఛను గురించి పాఠాలు చెప్పడం,ఆయన ప్రాణస్నేహితుడైన మోడీ బృందం ప్రతిస్పందించడం ఇక్కడ విచిత్రం.
రచయితలు మీడియాపైన ఇప్పుడు జరుగుతున్న దాడులు కేసులు అరెస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో విద్యార్థుల ప్రజాస్వామిక కార్యకలాపాలను, నిరసనలనూ అనుమితించడంలేదు. అమెరికాలోనే తమ కు వ్యతిరేకంగా పోస్టు పెట్టినవారిని వెంటనే వెనక్కు పంపేస్తామంటూ ఆంక్షలతో వేధిస్తున్నారు. కండ్లముందు కనిపించే ఈ వైరుధ్యాలను మన బడామీడియా ఎప్పుడూ చెప్పదు. వామపక్షాల వైపల్యాలపైనే విశ్లేషణలు చేసే వారు పథకం ప్రకారం దశాబ్దాలుగా సాగుతున్న ఈ కుట్ర పూరిత పోకడలను ప్రశ్నించరు. వారిలో చాలామందిపై ఇదే ఒత్తిడి పనిచేస్తుంటుంది.
అన్నిటా అంతే..
రాజకీయాలు, సాహిత్య రంగాలలో నోబెల్‌కు పాక్షి కత్వం వున్నా వైజ్ఞానిక, ఆర్థిక రంగాల్లో అదేమీ వుండదని కొందరు అనుకుంటారు. ఆ గ్రహీతల్లో చాలామంది ప్రతిభావంతులనడంలో సందేహం లేదు గానీ వాటికీ పరిమితులున్నాయి, పద్ధతులున్నాయి. మరీ ముఖ్యంగా నోబెల్ కమిటీ నూతన సృజనలకు అవార్డులివ్వడం అరుదు. ప్రపంచంలో వున్నవాటిని కనుగొన్నవాటికే ఎక్కు వగా ఇస్తుంటారు. అంటే ఇన్నోవేషన్ కన్నా డిస్కవరీకే ఇది లభిస్తుంటుంది.ఈ క్రమంలో మార్కెట్ వ్యవస్థ సామా జిక సాంకేతిక అవసరాలకు ఉపయోగపడే వాటిని లేద ంటే అసలైన సమస్యలకు ముసుగు తొడిగేవాటిని ఎంపిక చేస్తుంటారు. పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదం ప్రకృతి వనరులను, మానవ వనరులను కొల్లగొట్టడంపై ఆధారపడి వున్నాయి. వాటికి మరిన్ని దారులు చూప డానికీ, ఆ సైద్ధాంతిక కోణాలను అందమైన పదాలతో కప్పిపుచ్చే వాటికి ఈ అవార్డులు దక్కుతాయి. అందు లోనూ యూరప్ కేంద్రంగా ఎక్కువుంటాయనేది విమర్శ.
సృజనాత్మక విధ్వంసమా?
ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో సృజనాత్మక విధ్వంసం (క్రియెటివ్ డిస్ట్రక్షన్) అనే అంశంపై పరిశోధనలు చేసిన ఫిలిప్స్ అజియాన్, పీటర్ హొవిట్, జోయోల్ మోక్రిట్‌లకు నోబెల్ ఇచ్చారు. నిజానికి ఈ మాటనే వైరుధ్య భరితమై నది. పెట్టుబడిదారీ విధానం లాభాల పెంపుకోసం ఉత్పత్తి సాదనాలను విప్లవీకరిస్తూ పోయే క్రమంలో ఒక దశ తర్వాత ఉత్పత్తి శక్తులకూ ఉత్పత్తి సంబంధాలకు మద్య వైరుధ్యం తీవ్రమై అన్నిటినీ కబళించిన ఆ వ్యవస్థ తనను తనే లేకుండా చేసుకుంటుందని మార్క్స్ చెప్పిన చారిత్రిక సత్యం. దానికి ముసుగులు వేసిన ఒక ప్రయ త్నం ఈ సృజనాత్మక విధ్వంసం. అంతా మంచికే దారి తీస్తుందనీ, గత రెండు వందల ఏండ్లలో అపూర్వమైన అభివృద్ధికి కారణం ఈ సృజనాత్మక విధ్వంసమేనని ఈ దృక్పథం చెబుతోంది. అమెరికా స్వయంగా ఇప్పుడు ఎదు ర్కొంటున్న సంక్షోభం, సంఘర్షణ చూస్తే చాలు ఈ మా టల మర్మం తెలుస్తుంది. మార్క్స్ బోధనలకు దీన్ని మెరు గుదలగా చెప్పడం మరో విపరీతం.ఇక్కడ సమస్య ఈ విధంగా వనరులు కొందరి చేతుల్లో గాక అందరికీ చెంది వుంటే ఈ అభివృద్ధి మరెంత ప్రజాస్వామికంగా, విస్తృతం గా, మెరుగ్గా వుండేదన్న చర్చలోకి వీరు వెళ్లనివ్వరు.
ఇక రసాయన శాస్త్రంలో నోబెల్ విధ్వంసకర వినా శకర విషపదార్థాలను, వాయువులను కూడా నిల్వ చేయ డానికి అవసరమైన పరికరాల తయారీకి సంబంధిం చిన పరిశోధనకు ఇచ్చారు. భౌతికశాస్త్రంలో నోబెల్ పదార్థాల్లో లాగే శక్తికి సంబంధించి కూడా దాని పరిణా మాన్ని గుర్తించి (క్వాంటిఫికేషన్) పదార్థశకలాలను తరలించ డానికి సంబంధించిన పరిశోధనకు ఇచ్చారు, శరీరంలో రోగనిరోధక (ఇమ్యూనిటీ)వ్యవస్థకు చెందిన టి.కణాలు బయటినుంచి వచ్చి హానిచేసేవాటినే ధ్వంసం చేస్తూ లోపల సహజంగావున్న కణజాలంపై దాడి చేయ కుండా ఎలా గుర్తిస్తున్నాయో చెప్పే పరిశోధనకు వైద్య శాస్త్ర నోబెల్ ఇచ్చారు. ఇవన్నీ వైజ్ఞానికంగా ఉపయోగకరం అన్నది ఒకటైతే వాణిజ్య అవసరాలకు కూడా ఎక్కువ ఉప యోగపడతాయనేది మరొకటి. పరిశోధనల లోతుల్లోకి వెళితే మరిన్ని దిగ్భ్రాంతికరమైన సంగతులు అర్థమవు తాయి. కనుక రాజకీయేతర రంగాల్లో కూడా నోబెల్ గ్రహీ తల కృషి విశేషాలను హర్షిస్తూనే అసలు సమస్యలను అవి తక్కువ చేసి చూపడం, కొత్త భాష ముసుగులు తొడిగి మరుగు పర్చడం గుర్తించడం అవసరం. ఉన్న వ్యవస్థను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేసినప్పుడు శాస్త్ర, సృజ నాత్మక రంగాలు కూడా ఒక పరిధి దాటిపోవని ఇది మరోసారి నిరూపిస్తున్నది.
తెలకపల్లి రవి