ఈ భూ మండలంలో అన్ని గుర్తింపులలోను, ప్రశంసలలోను, పురస్కారాలలోను నోబెల్ పురస్కారానికి ఉన్న గుర్తింపు దేనికీ లేదనే చెప్పాలి. అటువంటి ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతిని 1901 నుండి భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యం, ప్రపంచ శాంతి మొదలైన అయిదు అంశాలలో మానవాళి మనుగడకు, ఉన్నతికి దోహదం చేసే ఆవిష్కరణలు, సేవలు చేసే వారికి నోబెల్ బహుమతి అందిస్తున్నారు. 1968 నుండి ఆర్థిక శాస్త్రం కూడా కలుపుకుని మొత్తం ఆరు రంగాలలో ప్రతీ సంవత్సరం నోబెల్ పురస్కారాన్ని అందిస్తారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం అలాగే రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగిన సమయంలో మాత్రం ఈ నోబెల్ బహుమతులు ప్రకటించలేదు.
1901 సంవత్సరం నుండి కొనసాగుతున్న ఈ బహుమతుల ప్రధానంలో భాగంగా ఈ సంవత్సరం నోబెల్ బహుమతి విజేతలను అక్టోబరు 6 నుంచి అక్టోబరు 13 వరకుహొ పైన పేర్కొన్న విభాగాలలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వారిని గొప్ప ఆవిష్కరణలు చేసిన వారిని విజేతలుగా ప్రకటించారు. ఎప్పటి లాగే వీరికిహొఈ ఏడాది ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10 వ తేదీన నోబెల్ పురస్కారం ప్రదానం చేస్తారు.
విశ్వ వ్యాప్తంగా విశిష్ట ప్రాధాన్యత కలిగిన నోబెల్ బహుమతుల చరిత్రను పరిశీలిస్తే స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రవేత్త,హొఆల్ఫ్రెడ్ నోబెల్ ‘డైనమైట్’ అనే శక్తివంతమైన పేలుడు పదార్థాన్ని ఆవిష్కరించించారు. ఆయన ఆవిష్కరించిన డైనమైట్ సహా వివిధ ఆవిష్కరణలపైహొ దాదాపు 355 పేటెంట్లను పెద్ద పెద్ద కంపెనీలకు విక్రయించడం ద్వారా ఆల్ఫ్రెడ్ నోబెల్ భారీ సంపదను కూడబెట్టారు. ఈ క్రమంలో 1896 డిసెంబరు 10న 63 ఏళ్ల వయసులో ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయారు. అయితే చనిపోవడానికి ఏడాది ముందు (1895లో) ఆయన ఒక వీలునామా రాశారు. అపారమైన తన సంపదను నిర్వహించడానికి, ఒక నిధిగా ఏర్పాటు చేసి భద్రతా బాండ్లలో పెట్టుబడి పెట్టమని ఆయన కోరారు. నేడు ఆ డబ్బుపై వచ్చే వడ్డీని నోబెల్ బహుమతులకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించడానికి నోబెల్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ వీలునామాలో ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రస్తావించారు.
మానవాళి మనుగడకు, ఉన్నతికి దోహదం చేసే ఆవిష్కరణలు, సేవలు చేసే వారికి నోబెల్ బహుమతులను ఇవ్వాలని ఆయన సూచించారు. నోబెల్ వీలునామా ప్రాతిపదికన 1900 సంవత్సరం జూన్ 29న నోబెల్ ఫౌండేషన్ ఏర్పాటైంది. తొలిసారిగా 1901లో వైద్యరంగం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి విభాగాల్లో నోబెల్ బహుమతులను ప్రదానం చేశారు. 1968లో స్వీడన్ కేంద్ర బ్యాంకు సిఫారసు మేరకు ఆర్థిక శాస్త్రాన్ని కూడా ఈ బహుమతుల జాబితాలో చేర్చారు.హొనోబెల్ గ్రహీతలను ఎంపికకుహొ ఒకే సంస్థ కాకుండా రంగాల వారీగా 5 వేర్వేరు సంస్థలు ఎంపిక చేస్తారు.
నోబెల్ ఫౌండేషన్ నియమాలు ప్రకారం నోబెల్ బహుమతికి నామినేషన్ అనేది ఏ ఒక్క వ్యక్తి కూడా తనను తాను చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే వారి పేరును ఇతరులు నామినేట్ చేయవచ్చు. నోబెల్ ప్రైజ్ కమిటీలోని సభ్యులు కూడా అర్హులైన వారి పేర్లను నామినేట్ చేయొచ్చు. కానీ కమిటీ సభ్యులు ఈ సమాచారాన్ని 50 ఏళ్ల వరకు బహిర్గతపర్చకూడదు. నోబెల్ ఫౌండేషన్ నియమం ప్రకారం నోబెల్ బహుమతిని గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు పంచుకోవచ్చు. శాంతి బహుమతి విషయంలో బహుమతిని ఒక సంస్థకు కూడా ప్రదానం చేయవచ్చు.హొ
నోబెల్ విజేతలకు ఇచ్చే పారితోషికం దాదాపు రూ.10 కోట్ల నగదుగా ఉంటుంది. దానితో పాటు 18 క్యారట్ల గోల్డ్ మెడల్, డిప్లొమాను ప్రదానం చేస్తారు.
నోబెల్ బహుమతిని మరణానంతరం ప్రదానం చేయడం సాధ్యం కాదు. అయితే 1974 నుంచి నోబెల్ బహుమతి ప్రకటించిన తర్వాత విజేత మరణిస్తే ఈ అవార్డును అందిస్తున్నారు.
హొ1901 నుండి నేటి వరకుహొ నోబెల్ లో గల అయిదు శాస్త్రాలు, అర్థశాస్త్రంహొ కలిపి మొత్తం 633 సార్లు బహుమతులు ప్రకటించారు. ఈ బహుమతులను 990 వ్యక్తిగత విజేతలు, 28 సంస్థలు 1026 మంది పొందారు. కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ సార్లు దక్కడం వలన ఈ సంఖ్య 1026 కు చేరింది.

విభాగాల వారీగా ఇప్పటి వరకూ
భౌతిక శాస్త్రంలోహొ119 మంది, రసాయన శాస్త్రంలో 117 మంది వైద్య శాస్త్రంలో 116 మంది సాహిత్యంలో 118 మంది శాంతిలోహొ106 మంది అర్థ శాస్త్రంలోహొ 57 మంది బహుమతి పొందారు.
నోబెల్ బహుమతి పొందిన భారతీయులు
1913 వరకు 2024 వరకు నోబెల్ బహుమతి పొందిన భారతీయులు
– రవీంద్రనాథ్ ఠాగూర్ (1913, సాహిత్యం)
– సీవీ రామన్ (1913, భౌతిక శాస్త్రం)
– హర్ గోవింద్ ఖోరానా (శరీరధర్మ శాస్త్రం (వైద్యం), 1968)
– మదర్‌థెరిసా (1979, శాంతి బహుమతి)
– సుబ్రమణ్యం చంద్రశేఖర్ (1983, భౌతికశాస్త్రం)
– అమర్త్యసేన్ (1998, అర్థశాస్త్రం)
– వెంకట్రామన్ రామకష్ణన్ (రసాయన శాస్త్రం, 2009)
– కైలాష్ సత్యార్థి (శాంతి, 2014)
-అభిజిత్ బెనర్జీ (ఆర్థిక శాస్త్రాలు, 2019)
నోబెల్ పురస్కారం తిరస్కరణ
నోబెల్ పురస్కారం సాధించాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అంతటి గొప్పదైన పురస్కారం లభించినా కూడా దానిని తిరస్కరించిన వారు కూడా లేకపోలేదు. అటువంటి వారిలోహొ
– రిచర్డ్ కుహ్‌న, అడాల్ఫ్ బుటెనండ్ట్, గెర్హార్డ్ డొమాగ్క్.. 1930లో రసాయన, వైద్యంకు వీరికి లభించిన నోబెల్ పురస్కారాలను నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ ఆదేశాల మేరకు నిర్బంధంగా తిరస్కరించారు. వీరు తరువాత పతకాన్ని, డిప్లొమాను అందుకున్నారు. కానీ డబ్బును తీసుకోలేదు.
– 1958 లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని ప్రకటింప బడిన రష్యా రచయిత అయినహొహొబోరిస్ పాస్టర్‌నాక్ తిరస్కరించారు.
– జీన్-పాల్ సార్త్రేహొ 1964లో నోబెల్‌హొ సాహిత్య పురస్కారాన్ని తిరస్కరించారు. తాను ఏ అధికారిక గౌరవాలను అంగీకరించనని, ఒక రచయితగా సంస్థాగతం కావడం తన రచన ప్రభావాన్ని తగ్గిస్తుందని భావించి స్వచ్ఛందంగా తిరస్కరించారు.
– లీ డక్ థో.. 1973లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక కాబడినాహొ వియత్నాంలో ఇంకా శాంతి నెలకొనలేదని పేర్కొంటూ స్వచ్ఛందంగా లీ డక్ థో తనను వరించిన నోబెల్ పురస్కారాన్ని తిరస్కరించారు.
ప్రస్తుత సంవత్సరం నోబెల్ కమిటీ నోబెల్ పురస్కారానికి వివిధ రంగాలలో ఎంపిక కాబడిన వారు చేసిన కషిని పరిశీలిద్దాం.
వైద్యంలో నోబెల్..
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తున్న ఆటోఇమ్యూన్ వ్యాధుల మూల కారణాన్ని, నివారణ రహస్యాన్ని ఛేదించిన అమెరికాకు చెందిన డాక్టర్ మేరీ ఇ.బ్రంకో, డాక్టర్ ఫ్రెడ్ రామ్స్‌డెల్, జపాన్‌కు చెందిన డాక్టర్ షిమోన్ సకాగుచి ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా వైద్య శాస్త్రంలో 2025 సంవత్సరపు నోబెల్ బహుమతి వరించింది. పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్‌పై చేసిన విప్లవాత్మక ఆవిష్కరణలకు గాను వారికి ఈ గౌరవం దక్కింది. ఈ పరిశోధనలు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ తన సొంత కణజాలంపై పొరపాటున దాడి చేయకుండా ఆపడానికి ఉపయోగించే అంతర్గత మెకానిజాన్ని వీరి పరిశోధనలు ప్రపంచానికి వివరించాయి.
డాక్టర్ షిమోన్ సకాగుచి పరిశోధన (జపాన్)
మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ నిత్యం అప్రమత్తంగా ఉండే ఒక సైన్యం వంటిది. ఇది బయటి నుంచి వచ్చే వైరస్‌లు, బ్యాక్టీరియాలను గుర్తించి వాటిని నిర్మూలిస్తుంది. ఈ సైన్యంలో అత్యంత కీలకం టి-సెల్స్‌హొ టి-సెల్ రిసెప్టర్లు ‘సెన్సార్ల’లా పనిచేసి, శత్రువులను గుర్తిస్తాయి.
కానీ ఈ వ్యవస్థలో కమ్యూనికేషన్ లోపం వల్ల టి-సెల్స్ పొరపాటున శరీరంలోని ముఖ్యమైన కణజాలాలను శత్రువులుగా భావించి దాడి చేస్తాయి. ఫలితంగా టైప్ 1 డయాబెటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వంటి ఆటోఇమ్యూన్ రోగాలు సంభవిస్తాయి. ఈ విధ్వంసాన్ని అరికట్టే ‘బ్రేకింగ్ మెకానిజం’ను కనుగొన్న మొదటి వ్యక్తి డాక్టర్ షిమోన్ సకాగుచి. ప్రస్తుతం ఆయన ఒసాకా యూనివర్సిటీలోని ఇమ్యూనాలజీ ఫ్రంటియర్ రీసెర్చ్ సెంటర్‌లో డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
మేరీ బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్ (అమెరికా)
షిమోన్ సకాగుచి పునాది వేసిన ట్రెగ్స్ పరిశోధనను, అమెరికన్ శాస్త్రవేత్తలు మేరీ బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్‌డెల్ జన్యుపరమైన కోణంలో ధ్రువీకరించారు. వీరిద్దరూ కలిసి 2001లో రెండో ముఖ్యమైన ఆవిష్కరణ చేశారు. వీరు ఇద్దరూ కలిసి ‘స్కర్ఫీ మౌస్’ అనే ప్రత్యేక ఎలుక జాతిపై అధ్యయనం చేశారు. ఈ ఎలుకలు తీవ్రమైన ఆటోఇమ్యూన్ రోగాలతో బాధపడుతుంటాయి. వారి పరిశోధనలో, ఎక్స్ క్రోమాజోమ్‌పై ఉన్న FOXP3 జీన్‌లో మ్యూటేషన్ జరగడమే ఈ రోగాలకు కారణమని తేలింది. ఈ మ్యూటేషన్ ట్రెగ్స్ లోపించడానికి దారితీస్తుంది, దీని ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ నియంత్రణ కోల్పోయి శరీర కణాలపై దాడి చేస్తుంది.
మానవులలో, FOXP3 జీన్‌లో లోపం ఏర్పడినప్పుడు IPEX సిండ్రోమ్ అనే అరుదైన, ప్రాణాంతకమైన ఆటోఇమ్యూన్ వ్యాధి వస్తుంది. బ్రంకోవ్, రామ్స్‌డెల్ ఈ జన్యు మూలాన్ని స్పష్టంగా నిరూపించడం ద్వారా, ఇమ్యునాలజీలో కొత్త రంగాన్ని ఆవిష్కరించారు. మేరీ బ్రంకోవ్ ప్రస్తుతంహొ అమెరికాలోని సీటెల్‌లో ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఫ్రెడ్ రామ్స్‌డెల్ శాన్ ఫ్రాన్సిస్కోలోని సోనోమా బయోథెరప్యూటిక్స్‌కు సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఉన్నారు.హొఈ ముగ్గురు శాస్త్రవేత్తల ఆవిష్కరణలు కేవలం రోగాల కారణాలను వివరించడానికే పరిమితం కాలేదు, నేడుహొ ప్రధానంగా క్యాన్సర్ ఇమ్యునోథెరపీలో, ఆటోఇమ్యూన్ రోగాలకు చికిత్స అందించడంలో అవయవ మార్పిడికి సంబంధించిన శస్త్ర చికిత్సలలో వీరి ట్రెగ్స్ పరిశోధన ఆధునిక వైద్యంలో చికిత్సా విధానాలను సమూలంగా మార్పులు తీసుకు వస్తుంది. వీరి పరిశోధనలుహొ ఆటోఇమ్యూన్ రోగాలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయని నోబెల్ కమిటీ పేర్కొన్నారు. ఈ అవార్డ్ ప్రకటన వైద్య శాస్త్రంలో, ముఖ్యంగా రోగనిరోధక శాస్త్ర రంగంలో సరికొత్త చికిత్సల అభివద్ధికి, క్యాన్సర్, హొఅవయవ మార్పిడి రంగాల్లో సరికొత్త పరిశోధనలకు దారితీసిందని కమిటీ ప్రశంసలు కురిపించడం జరిగింది.
భౌతిక శాస్త్రంలో నోబెల్
డిజిటల్ కమ్యూనికేషన్లు, కంప్యూటింగ్ సాంకేతికతలను ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తున్న ‘సబ్-అటామిక్ క్వాంటమ్ టన్నెలింగ్ పై తొలినాళ్లలో విశేష పరిశోధనలు చేసిన అమెరికన్ శాస్త్రవేత్తలు జాన్ క్లార్క్, మిచెల్ హెచ్.డెవోరెట్, హొజాన్ ఎం. మార్టినిస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 2025 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతిహొ పురస్కారం దక్కింది.హొవీరిలో
జాన్ క్లార్క్:హొఅమెరికాలో ప్రసిద్ధ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు. ఆయన ఎక్కువగా క్వాంటం ఫిజిక్స్‌పై లోతైన అధ్యయనాలు చేశారు.
- మిచెల్ హెచ్.డెవోరెట్:హొఫ్రాన్స్‌లో పుట్టిన ఈ శాస్త్రవేత్త సూపర్‌కండక్టింగ్ సర్క్యూట్లపై పరిశోధనలు చేసిన వ్యక్తిగా పేరుపొందారు. సూపర్‌కండక్టివిటీ అంటే అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద విద్యుత్ నిరోధకత లేకుండా విద్యుత్తును ప్రసారం చేయడం. దీనిపై వీరి కషి క్వాంటం సర్క్యూట్ల అభివద్ధికి కీలకంగా మారింది.
- జాన్ ఎం. మార్టినిస్:హొఅమెరికాలోని జాన్ ఐస్ క్యాంపస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. క్వాంటం కంప్యూటర్ మెషిన్ డిజైన్‌పై ఆయన చేసిన కషి ప్రపంచం కొనియాడింది. క్వాంటం కంప్యూటర్ల రూపకల్పనలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
ప్రపంచాన్ని మార్చే శాస్త్రీయ ఆవిష్కరణలలోహొ క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఒకటి. చిన్న అణువులు, ఎలక్ట్రాన్లు ఎలా ప్రవర్తిస్తాయి, అవి ఎక్కడ ఉండవచ్చు, ఎలా కదులుతాయి ఇవన్నీ క్వాంటమ్ శాస్త్రం వివరిస్తుంది. కానీ ఈ ప్రభావాలు కేవలం సూక్ష్మ ప్రపంచంలోనే జరుగుతాయని ఇప్పటివరకు అనుకున్నారు.
2025 నోబెల్ ఫిజిక్స్ విజేతలు ఆ నమ్మకాన్ని తారుమారు చేశారు! మనకు తెలిసిన భౌతిక ప్రపంచంలో, ఒక వస్తువు గోడను ఢకొీంటే అది ఆగిపోతుంది. కానీ అణువుల ప్రపంచంలో అలా జరగదు. అణువు ఆ గోడను దాటి వెళ్లే అవకాశం ఉంటుంది.ఇది ”క్వాంటమ్ టునెల్లింగ్” అని అంటారు. విజేతల బందం ఈ ప్రభావాన్ని కేవలం అణువులలో కాదు, మానవులు తయారు చేసిన విద్యుత్ సర్క్యూట్లలో కూడా చూపించారు!
నోబెల్ రసాయనం
ఒకప్పుడు మన ప్రపంచంలో అత్యంత విలువైన వాయువులను (గ్యాస్) నిల్వ చేయడం లేదా కలుషిత నీటి నుండి విష పదార్థాలను వేరు చేయడం అనేది చాలా కష్టమైన పనిగా ఉండేది. ఎందుకంటే, ఆ అణువులను బంధించి ఉంచగలిగే సరైన ‘గదులు’ రసాయన శాస్త్రంలో లేవు.
ఆ సమయంలో, జపాన్‌కు చెందిన ప్రొఫెసర్ సుసుము కిటాగవా, ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ రిచర్డ్ రాబ్సన్, మరియు అమెరికాకు చెందిన ప్రొఫెసర్ ఒమర్ ఎం. యాఘీ అనే ముగ్గురు గొప్ప రసాయనహొ శాస్త్రవేత్తలు ఈ విషయంలో పరిశోధనలు మొదలు పెట్టారు.
హొ’నానో-గది’ రూపకల్పన ప్రధాన లక్ష్యంగా వీరి పరిశోధనలు ఆరంభమయ్యాయి. దీనికోసం హొ’మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్’ (వీఉఖీర) అనే సరికొత్త రకమైన పదార్థాన్ని సష్టించడం లక్ష్యంగా పెట్టుకుని ప్రపంచంలోని అతి చిన్న నిర్మాణ యూనిట్లను (అణువులను) ఉపయోగించి ఒక అద్భుతమైన ‘భవనం’ కట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఇనుము, జింక్ వంటి లోహ అణువులను గట్టి స్తంభాలుగా నిర్మాణ సామగ్రిగా ఎంచుకున్నారు. ఈ క్రమంలో సేంద్రీయ అణువులను ఆ స్తంభాలను కలిపే సరళమైన కానీ బలమైన కనెక్టర్‌లుగా ఉపయోగించారు. వీరు అణువులను కలిపి కట్టిన ఈ నెట్‌వర్క్ భవనం ఒక సాధారణ భవనం కాదు. దానిని భూతద్దంలో చూస్తే, అది ఒక అణు తేనెపట్టు వలే కనిపించింది. ఈ తేనెపట్టు లోపల అద్భుతమైన విశాలమైన ఖాళీ గదులు ఉన్నాయి.ఈ నిర్మాణాలు , ఒక చిన్న చక్కెర క్యూబ్ పరిమాణంలో ఉండే వీఉఖీ పదార్థం లోపల ఉపరితల వైశాల్యం మొత్తం ఒక ఫుట్‌బాల్ మైదానం అంత ఉంటుంది! ఈ అపారమైన ఉపరితలమే వీరి పరిశోధనలు కీలకంగా నిలచింది.
సాహిత్య నోబెల్
సాహిత్యంలో ఈ సంవత్సరం నోబెల్ బహుమతి హంగేరీకి చెందిన లాస్లోహొక్రాస్నోహౌర్కైకి లభించింది. ఆయన రచించినహొనవల హెర్ట్జ్ 07769 కి 2025 సాహిత్య నోబెల్ బహుమతిని అందుకోబోతున్నారు. ఈ నవల సమకాలీన జర్మనీ సామాజిక అశాంతిని, హింస, ఆధ్యాత్మిక సమిళితంతో రూపొందినదిగా గుర్తింపు లభించింది.
1954లో హంగేరీ, రొమేనియా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్యులా అనే చిన్న పట్టణంలో జన్మించిన క్రాస్నోహౌర్కై తన సుదీర్ఘమైన, సంక్లిష్టమైన రచనలు, లోతైన తాత్వికత్వాన్ని ప్రతిభింబిస్తాయి. యూరోపియన్ సంప్రదాయంలో ఒక ఇతిహాస రచయితగా ఈయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఫ్రాంజ్ కాఫ్కా, థామస్ బెర్న్హార్డ్లతో పోలిస్తే అతని రచనలు అసంబద్ధత, వింతైన చిత్రాలు, ఆధ్యాత్మిక ఆత్మపరిశీలనను మిళితం చేస్తాయి. మానవత్వం, అరాచకం, ఆధునిక సమాజంలోని సంక్షోభాలను నిష్కపటంగా ప్రస్తావిస్తాయి. మొత్తంమీద, లాజ్లో లోతైన ఆలోచనాత్మక, విచారకరమైన కథలను రాయడం ద్వారా ప్రపంచ ఖ్యాతి గడించారు.హొ మధ్య యూరోపియన్ సంప్రదాయంలో గొప్ప ఇతిహాస రచయితగా నోబెల్ కమిటీ ఇతడిని అభివర్ణించింది.హొ అతని రచన కాఫ్కా ద్వారా థామస్ బెర్న్ హార్డ్ వరకు విస్తరించింది. అసంబద్ధత, వికారమైన మితిమీరిన లక్షణం కలిగి ఉందని నోబెల్ కమిటీ అభిప్రాయపడింది. భయానక విపత్తుల మధ్య కూడా కళకు ఉన్న శక్తిని చాటే ఆయన విప్లవాత్మక సాహిత్య కషికి ఈ పురస్కారం అందజేస్తున్నట్టు స్వీడిష్ అకాడమీ తెలిపింది.
సామాజిక ఆరాచకం, హింస, దహనకాండలతో చుట్టుముట్టిన ఒక చిన్న తురింగియన్ పట్టణాన్ని చిత్రీకరించడంలో దాని కచ్చితత్వానికి 2025 అవార్డు గెలుచుకున్న అతని రచన హెర్ట్జ్ 07769 గొప్ప సమకాలీన జర్మన్ నవల అని భావిస్తున్నారు. జోహన్ సెబాస్టియన్ బాచ్ సాంస్కతిక వారసత్వానికి వ్యతిరేకంగా రూపొందించిన ఈ నవల, మానవ అనుభవంలో హింస, అందం ఎలా కలిసి ఉంటాయో వివరించింది.
శాంతి నోబెల్
శాంతి మార్గంలో ప్రజాస్వామ్య పునరుజ్జీవనం. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి వెనిజులా చెందిన మరియా కొరీనా మాచాడోకు ప్రకటించారు. వెనిజులా అనేది లాటిన్ అమెరికా ఖండంలోని చమురు సంపదతో నిండి ఉన్న దేశం.
ఆర్థిక నోబెల్
ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రాలలో నోబెల్ అవార్డునుహొ స్వీడిష్ సెంట్రల్ బ్యాంక్‌హొ1968 నుండి అందిస్తున్నారు.
వాస్తవానికి దీనిని ‘బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్’ అని పిలుస్తారు. దీనిని ఆర్థిక శాస్త్రంలో నోబుల్ గానే అత్యధికులు పరిగణిస్తుంటారు. సాంకేతికంగా ఇది ‘నోబెల్ బహుమతి’ కాదన్నది కొందరి వాదన. అయితే ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబరు 10నే ఏటా.. వైద్యం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి రంగాల్లో అందించే నోబెల్ పురస్కారాలతో పాటే అర్థ శాస్త్రంలోని ఈ అవార్డునూ ప్రదానం చేస్తుంటారు.
సజనాత్మక ప్రగతికి ఆర్థిక నోబెల్…
ప్రస్తుతం 2025 సంవత్సరానికి ఆర్థిక నోబెల్‌హొరాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ హొ ‘ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వద్ధి’ని వెల్లడించినందుకు ఈ అవార్డును జోయెల్ మోకిర్, ఫిలి అఘియన్, పీటర్ హౌవిట్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. పాత ఆవిష్కరణల స్థానాన్ని కొత్త ఆవిష్కరణలు భర్తీ చేసేటపుడు అవి ఎలా పని చేస్తున్నాయి అనేది ఒక్కటి పరిశీలిస్తే సరిపోదు. కొత్త ఆవిష్కరణ అనేది ఏ రకంగా విజయం సాధిస్తుంది అనేది శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు చక్కగా వివరించారు.
సాంకేతికత, ఆవిష్కరణలు, సమాజంలో మార్పులను స్వీకరించే శక్తి.. ఇవే దీర్ఘకాల వద్ధికి మూల కారణాలని వీరు తమ పరిశోధనల్లో స్పష్టం చేశారు. ఆర్థిక వద్ధిపై నవకల్పనల ప్రభావాన్ని విపులంగా విశదీకరించడంతో పాటు కీలకమైన ‘సజనాత్మక విధ్వంసం’ అనే భావనపై విస్తత పరిశోధనలు చేపట్టిన జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హౌవిట్ ముగ్గురినీ అర్థ శాస్త్రంలో నోబెల్ వరించింది.
జోయెల్ మోకిర్
అమెరికా ఇజ్రాయేల్ మూలాలున్నహొనెదర్లాండ్ ఆర్థిక చరిత్ర కారుడైనహొఅమెరికాలోని నార్త్వెస్టర్న్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న జోయెల్ మోకిర్ సజనాత్మక విద్వంసం అనే భావనపై చారిత్రక ఆధారాలను విశ్లేషిస్తూ.. హొ పరిశోధనలు సాగించారు. దీని ద్వారా సాంకేతిక పురోగతితో ఆర్థిక వ్యవస్థ ఎలా అభివద్ధి చెందుతుందో వివరించారు. సమాజం కొత్త ఆలోచనలను అంగీకరించి మార్పును ఆమోదించినప్పుడే సుస్థిర వద్ధి సాధ్యమవుతుందని ఆయన నిరూపించారు.
యూరప్‌లో 18వ శతాబ్దంలో జరిగిన పరిశ్రమల విప్లవం ఎందుకు ఇంగ్లాండ్‌లో మొదలైందో, ఎందుకు ఇతర దేశాల్లో ఆలస్యంగా జరిగిందో ఆయన తన పరిశోధనలో వివరించాడు. నూతన ఆవిష్కరణలు ఉత్పత్తిని వేగవంతం చేయడంతో పాటు కొత్త ఉద్యోగాలు, కొత్త పరిశ్రమలను తీసుకువస్తాయి. దీనిని బట్టి జ్ఞానం, శాస్త్రం, సాంకేతికతలను పంచుకునే సంస్థలు సంస్కతి ఉన్న చోటే వద్ధి జరుగుతుంది.ఈ అభివద్ధి సాగాలంటే నవీన ఆవిష్కరణలకు ప్రోత్సాహం,మెరుగైన విద్యా వ్యవస్థ ఉంటేనే అది ముందుకు సాగుతుందని మోకీర్ వివరించాడు.
హౌవిట్, అఘియన్‌హొ
సజనాత్మక విద్వంసం అనే భావనను కెనడాలో జన్మించి అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న హౌవిట్ అలాగే ఫ్రాన్స్ లో జన్మించిహొలండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనుబంధంగా పరిశోధనలు కొనసాగిస్తున్న ఫిలిప్ అఘియన్ సైతం గణిత సిద్ధాంతాల సహాయంతో తమ పరిశోధనలను వివరించారు. పాత పద్ధతులను కొత్త ఆవిష్కరణలు భర్తీ చేసే ప్రక్రియ ద్వారా ఆర్థిక వ్యవస్థ ఎప్పటికప్పుడు ముందుకు సాగుతుందని వీరి సిద్ధాంతం చెబుతుంది.
దీని ప్రకారం కొత్త సాంకేతికత వస్తే, పాతది మాయమవుతుంది. కానీ ఆ ‘ధ్వంసం’ వల్లే కొత్తదానికి స్థానం లభిస్తుంది. అదే ఆర్థిక అభివద్ధి యొక్క సహజ చక్రం. ఆర్థిక శాస్త్రంలో దీనినే ‘సజనాత్మక విధ్వంసం (క్రియేటివ్ డిస్ట్రక్షన్)’గా పరిగణిస్తారు. జోసెఫ్ షుంపీటర్ అనే ఆర్థికవేత్త 1942హొ ఈ భావనను ప్రాథమికంగా ప్రస్తావించారు. మోకిర్, హౌవిట్, అఘియన్ ‘క్రియేటివ్ డిస్ట్రక్షన్’ పేరుతో దీనిని మెరుగ్గా వివరించారు.
వీరి ముగ్గురి పరిశోధనలను నేటి ప్రభుత్వాలు, ఆర్థికవేత్తలు ఆచారంలోనికి తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.దానికి దేశం అభివద్ధి కావాలంటే పాత పరిశ్రమలను కాపాడడం కాకుండా, కొత్త ఆవిష్కరణలకు మార్గం ఇవ్వాలనే అభిప్రాయం బలపడుతూ వస్తుంది.ఇది ఆచరణలో సాధించాలంటే విద్య, పరిశోధన, టెక్నాలజీ పై పెట్టుబడులు పెట్టడం ఆర్థిక వద్ధి మూలాధారమనే విషయాన్ని ప్రభుత్వాలు గ్రహించి ఆవిష్కరణలను ప్రోత్సహించే స్వేచ్ఛా వాతావరణం, ప్రతిభను ప్రోత్సహించే విధానాలు అవలంబిస్తున్నాయి.
వీరి ముగ్గురి పరిశోధనల ద్వారా ”వద్ధి అంటే కేవలం ఉత్పత్తి కాదు, అది ఆలోచనల మార్పు, ఆవిష్కరణల జ్వాల” అనే విషయం స్పష్టమవుతోంది. ఈ బహుమతి ద్వారా లభించే మొత్తంలో మోకిర్ సగం బహుమతి అందుకోగా, అఘియన్, హౌవిట్‌లు మిగతా సగాన్ని పంచుకోనున్నారు.
”కొత్త ఆవిష్కరణలు ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నప్పుడు- అవి ఎంతవరకు ప్రయోజనకరమో చూసుకోవడమే కాకుండా, అందుకు కారణాలనూ శాస్త్రీయంగా విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకతను మోకిర్ నొక్కిచెప్పగా సుస్థిర వద్ధి వెనుక ఉన్న క్రియావిధానాలను గణాంక నమూనాలతోహొహౌవిట్, అఘియన్ సూత్రీకరించారనిహొనోబెల్ కమిటీ ముగ్గురినీ ప్రససించింది.
ఈ సంవత్సరం ప్రకటించిన నోబెల్ అవార్డులలో శాంతి బహుమతిపై మాత్రం పలు విమర్శలు ఎదురయ్యాయి.ముఖ్యంగా ఈ అవార్డుపై తీవ్రంగా ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈసారి కూడా నోబెల్ దక్కకపోవడంతో, వైట్ హౌస్ మరియు ట్రంప్ మద్దతుదారులు ఈ నిర్ణయాన్ని విమర్శించారు. కొందరు విమర్శకులు ఈ బహుమతిని కేవలం రాజకీయపరమైన ఎంపికగా చూశారనే విమర్శ కూడా ఉంది. మచాడోకు ట్రంప్ మరియు ఇతర తీవ్ర మితవాద కూటముల నుండి మద్దతు ఉండటం వలన, ఈ ఎంపిక అంతర్జాతీయ రాజకీయాలకు అనుగుణంగా జరిగిందని ప్రచారంలో వుంది. బహుమతి ప్రకటనకు కొద్ది రోజుల ముందు, నోబెల్ శాంతి బహుమతి సమాచారం లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై నోబెల్ ఇన్స్టిట్యూట్ విచారణ చేపట్టడం కూడా విమర్శలకు, అనుమానాలకు దారితీసింది.
అమెరికా కీలు బొమ్మ మచాడో కు ఈ అవార్డ్ ప్రకటించారని దానివల్లనే ఆమె ఈ అవార్డ్ ను ట్రంప్ కు అంకితం ఇచ్చారనే విమర్శ కూడా ఉంది.ఇది మనః సాక్షి లేని నిర్ణయమని దీనిని పునః పరిశీలన చేయాలని అమెరికా ఇస్లామిక్ దేశాల మండలి డిమాండ్ చేసింది.
హొ125 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో, ఈ అవార్డు ప్రపంచం యొక్క మేధో, నైతిక ప్రగతికి నిదర్శనంగా నిలిచింది, అయినప్పటికీ, దాని నిర్ణయాలు అనేక సందర్భాలలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. అవి - ఈ అవార్డును గరిష్టంగా ముగ్గురికి మాత్రమే ఇవ్వాలనే నిబంధనపై విమర్శ ఉంది. ముఖ్యమైన ఆవిష్కరణలు తరచుగా బందంగా జరిగినప్పటికీ, దానికి కీలకమైన కషి చేసిన నాల్గవ లేదా ఐదవ వ్యక్తి లేదా మరణించిన వ్యక్తిని విస్మరించబడటంపై పెద్ద విమర్శ ఉంది. వ్యక్తిగత ప్రతిభపైనే ఈ బహుమతి దష్టి సారించడం వలన, అది తరచుగా సామూహిక కషిని విస్మరిస్తుంది.
- ఆధునిక సైన్స్ యొక్క సంక్లిష్టతకు అనుగుణంగా ఈ బహుమతి నియమాలు లేవని విమర్శకులు తరచుగా వాదిస్తున్నారు.
- సాహిత్య నోబెల్ బహుమతి తరచుగా కళాత్మక నైపుణ్యంతో పాటు రాజకీయ సందేశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తుందనే విమర్శ కూడా ఉంది.ముఖ్యంగా సాహిత్య బహుమతి విభాగం ఐరోపాపై ఎక్కువ దష్టి పెట్టడం జరిగింది అనే విమర్శ ఉంది.
- ప్రధానంగా పశ్చిమ దేశాల ఆధిపత్యం ఈ అవార్డ్ పొందడంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అత్యధిక బహుమతులు (400ం) యునైటెడ్ స్టేట్స్ కు లభించడం, పరిశోధన మరియు విద్యా రంగాలలో పశ్చిమ దేశాలకున్న ఆధిపత్యాన్ని, కమిటీల ఎంపికలలోని ప్రాధాన్యతను ఇది సూచిస్తుంది.హొ
5 జీన్-పాల్ సార్త్రే వంటి వారు ఈ బహుమతిని తిరస్కరించడం, ఈ అవార్డు ఒక కళాకారుడి స్వేచ్ఛను లేదా రాజకీయ పోరాటం యొక్క సమగ్రతను పరిమితం చేస్తుందనే అభిప్రాయాన్ని బలోపేతం చేసింది.
హొఈ అవార్డు పై పలు విమర్శలు ఉన్నప్పటికీహొనోబెల్ బహుమతి మానవ మేధస్సు, నైతిక ధైర్యానికి ఒక దీపస్తంభం వంటిదని చెప్పవచ్చు. 1901 నుండి 2025 వరకు ప్రపంచం యొక్క గొప్ప ఆవిష్కరణలను, మానవతావాద కషిని ఈ బహుమతి గౌరవించింది.హొఏదేమైనప్పటికీ, శాస్త్రం, సాహిత్యం, శాంతి అత్యున్నత ప్రమాణాలను ప్రోత్సహించడంలో నోబెల్ బహుమతి చారిత్రక ప్రాముఖ్యత, ప్రభావం మాత్రం తిరుగులేదనే చెప్పాలి.ఇది భవిష్యత్తులో కూడా మానవజాతి ప్రగతిని ముందుకు నడిపించే ఒక ముఖ్యమైన శక్తిగా కొనసాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. భౌతిక, రసాయన, వైద్య విభాగాలలో నోబెల్ బహుమతి చాలా వరకు దాని లక్ష్యాన్ని నెరవేర్చింది. 1901లో ఎక్స్-రేలను ఆవిష్కరించిన విల్‌హెల్మ్ రోయెంటెన్ నుండి ఆధునిక క్వాంటం ఫిజిక్స్, జీన్ టెక్నాలజీ వరకు, ఈ అవార్డులు శాస్త్రీయ పురోగతిని గౌరవించాయి.
మదర్ థెరిసా, నెల్సన్ మండేలా, మలాలా యూసఫ్‌జారు వంటి వారికి ఈ బహుమతి లభించినప్పుడు, ఇది మానవతావాదం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడే వారికి గొప్ప ప్రోత్సాహాన్ని అందించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.రెడ్ క్రాస్, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలకు శాంతి బహుమతి ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ సహకార ప్రాముఖ్యతను నొక్కి చెప్పినందుకు అనేక ప్రశంసలు లభించాయి.
నోబెల్ బహుమతుల సంఖ్య కూడాహొ అభివద్ధికి సూచికగానే చెప్పవచ్చు.అమెరికా 400కు పైగా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్లు ఒక్కొక్కటి వందకుపైగా నోబెల్ బహుమతులు పొందాయి. స్వీడన్ వంటి బుల్లి దేశం సైతం 35 మంది నోబెల్ విజేతలను ప్రపంచానికి అందించింది.హొ
మన దేశంలో ఎందరో శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, సజనాత్మక రచయితలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు వరించిన నోబెల్ బహుమతులు కేవలం తొమ్మిదంటే తొమ్మిదే!హొ
దీనిని బట్టి నోబెల్ సాధనలో మన దేశం ఎంతో వెనకబడిందనే చెప్పాలి.మన దేశంలో
జిజ్ఞాస, సజనాత్మకతలకు సరిగ్గా సాన పెట్టక పోవడమే దీనికి కారణంగా చెప్పవచ్చు. ఈ విషయంలో దష్టి పెట్టకుండా కేవలం భారత్ 2047 నాటికి వికసిత దేశంగా అవతరించాలని నినాదాలు ఇవ్వడం ద్వారా నోబెల్‌హొ సాధించలేము. విద్యా సంస్కరణలు ద్వారా నవకల్పనలకు సజనాత్మక ఆలోచనలకు అవసరమైన నిధులు, సరైన గుర్తింపు ఇవ్వగలగాలి. దాని కోసం మౌలిక పరిశోధనలపై విరివిగా పెట్టుబడులు పెట్టాలి. ప్రపంచ గతిని మార్చే నాణ్యమైన ఆలోచనల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశ భాగస్వామ్యం ఇనుమడించాలి.అప్పుడే మనం కూడా నోబెల్ పురస్కారాలలోహొ గౌరవ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతాము.
నోబుల్ బహుమతులలో అపూర్వ రికార్డ్ - ఒకే కుటుంబానికి 5 నోబెల్ బహుమతులు దక్కడం ఓ రికార్డ్ గా నమోదయింది. క్యూరీల కుటుంబంలో ఇప్పటివరకు 5 నోబెల్ బహుమతులు రావడం గమనార్హం. ఇందులో మేడం క్యూరీకి రెండు పురస్కారాలు వరించాయి. ప్రపంచంలోనే రెండునోబెల్ పురస్కారాలుహొఅందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా మేడం క్యూరీ రికార్డుల్లోకి ఎక్కారు.
- రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578