నవతెలంగాణ – మిర్యాలగూడ
రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 30 (ఆదివారం) నుంచి ప్రారంభమై డిసెంబర్ 14న ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత డిసెంబర్ 3వ తేదీ బుధవారం నుంచి ప్రారంభమై డిసెంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలలో మిర్యాలగూడ మండలంలో 46 గ్రామపంచాయతీలు ఉండగా నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ రెండవ విడతలో భాగంగా ఈనెల 30 (ఆదివారం) నుంచి నామినేషన్ల స్వీకరణ (దాఖలు) ప్రక్రియ ప్రారంభం కానున్నది. డిసెంబర్ 2 ( మంగళవారం) నామినేషన్ దాఖలకు చివరి తేదీ అని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం విధితమే. మిర్యాలగూడ మండలంలో 13 క్లస్టర్ కేంద్రాలలో నామినేషన్లను స్వీకరించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చునని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
మండలంలోని 46 గ్రామపంచాయతీలలో 55,180 మంది ఓటర్లు ఉండగా 394 వార్డులుగా విభజించారు. నామినేషన్లు దాఖలు చేసే క్లస్టర్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాద్రిపాలెం క్లస్టర్ కేంద్రంలో వెంకటాద్రిపాలెం, జంకుతండా, టీక్యా తండా గ్రామపంచాయతీ చెందినవారు తమ తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చునని అధికారులు తెలిపారు.
తుంగపహాడ్ క్లస్టర్ కేంద్రంలో తుంగపహాడ్, సామెగాని తండా, లావుడి తండా గ్రామపంచాయతీలు, యాద్గార్ పల్లి క్లస్టర్ కేంద్రంలో యాద్గార్ పల్లి, కాల్వపల్లి, కాల్వపల్లి తండా గ్రామపంచాయతీ లు, ఐలాపురం క్లస్టర్ కేంద్రంలో ఐలాపురం, కుంట కింది తండా, గోగు వారిగూడెం, గ్రామపంచాయతీలు, గూడూరు క్లస్టర్ కేంద్రంలో గూడూరు, బోటియ నాయక్ తండ, కిష్టాపురం, చింతపల్లి గ్రామపంచాయతీలు, ఆలగడప క్లస్టర్ కేంద్రంలో ఆలగడప, సుబ్బారెడ్డి గూడెం, బాధలాపురం అవంతిపురం గ్రామపంచాయతీలు, జప్తి వీరప్ప గూడెం క్లస్టర్ కేంద్రంలో జప్తి వీరప్ప గూడెం, సిత్య తండా, బల్లు నాయక్ తండా, అన్నారం గ్రామపంచాయతీలు, రాయిని పాలెం క్లస్టర్ కేంద్రంలో రాయిని పాలెం, జాలు బాయి తండా, ముల్కల కాలువ గ్రామపంచాయతీలు, ఊట్లపల్లి క్లస్టర్ కేంద్రంలో ఉట్లపల్లి, తక్కెలపహాడ్, తక్కెల పహాడ్ తండా గ్రామపంచాయతీలు, తడకమల్ల క్లస్టర్ కేంద్రంలో తడకమళ్ళ, దొండ వారి గూడెం, జేత్య తండా గ్రామపంచాయతీలు, కొత్తగూడెం క్లస్టర్ కేంద్రంలోకొత్తగూడెం,హాట్య తండా, రుద్రారం, లక్ష్మీపురం, కొత్తపేట గ్రామపంచాయతీలు, వాటర్ ట్యాంక్ తండా క్లస్టర్ కేంద్రంలో వాటర్ ట్యాంక్ తండా, కురియ తండా, భోగ్యగోప సముద్రం తండా, చిల్లాపురం గ్రామపంచాయతీలు, శ్రీనివాస్ నగర్ కలెక్టర్ కేంద్రంలో శ్రీనివాస్ నగర్ దుబ్బ తండా ధీరావత్ తండా జటావ తండా గ్రామపంచాయతీలకు చెందినవారు నామినేషన్లను దాఖలు చేసేందుకు తమ కేటాయించిన క్లస్టర్ కేంద్రానికి వెళ్లవలసి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మిర్యాలగూడ మండలంలోని నామినేషన్లు స్వీకరణ కస్టర్ కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.


