నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లాలో నార్మల్ డెలివరీలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని నిజామాబాద్ గైనకాలజిస్ట్ వైద్యులకు డి ఎం అండ్ హెచ్ ఓ రాజశ్రీ సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ లో ఉన్న గైనకాలజిస్ట్ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశ్రీ మాట్లాడుతూ.. నార్మల్ డెలివరీల పట్ల గర్భిణీలకు అవగాహన కల్పించాలని, నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తూ సిజారియన్ సెక్షన్ రేట్ తక్కువ చేయాలని సూచించారు. అవసరమైతే తమ ఆసుపత్రికి వచ్చే గర్భిణీలకు నార్మల్ డెలివరీలో ప్రాధాన్యతను క్లుప్తంగా వివరించాలని తెలిపారు. ఈ నేపధ్యంలో గర్భిణీలపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు అనుగుణంగా ఆసుపత్రిలో అన్ని రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అబార్షన్స్, గర్భస్రావం, పి సి పి ఎన్ డి టి – అల్ట్రాసౌండ్ మార్గదర్శకాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో గైనకాలజీ వైద్యుల అధ్యక్షులు డాక్టర్ మల్లేశ్వరి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలజ, గైనకాలజిస్ట్ వైద్యురాల్లు తదితరులు పాల్గొన్నారు.
నార్మల్ డెలివరీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES