Tuesday, July 22, 2025
E-PAPER
Homeఖమ్మంశాశ్వత పోలింగ్ కేంద్రం కాదు…

శాశ్వత పోలింగ్ కేంద్రం కాదు…

- Advertisement -
  • – పోలింగ్ కేంద్రం అవశేషం మాత్రమే..
  • నవతెలంగాణ – అశ్వారావుపేట
  • అధికారులు ప్రభుత్వ కార్యక్రమాల్లో కనబరిచిన శ్రద్ద అనంతరం చూపించరు.కార్యక్రమం చేసామా, విజయవంతం అయిందా, ముగిసిందా అనే చూస్తారు. తర్వాత అంతా షరా మామూలే.
  • పోలింగ్ నిర్వహణ కోసం ఎన్నికలు సంఘం కొన్ని నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. అందుకోసం ఆకర్షణీయంగా ఉండేందుకు ఇదిగో ఈ చిత్రంలో కనపడేలా ప్లెక్సీ లు ఏర్పాటు చేస్తుంది.
    • అశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని నెహ్రు నగర్ మండల పరిషత్ పాఠశాల లో 2024 మే 13 న జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కోసం పోలింగ్ కేంద్రం 165 లో దివ్యాంగుల ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఎన్నికలు ముగిసి నేటికి సంవత్సరం పైనే అయినా ఆ ఫ్లెక్సీ ని అలానే ఉంచారు. అయితే పిల్లలు రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేనప్పటికీ ఈ ఆర్చ్ ప్లెక్సీ ఉండటం తో పాఠశాల నేమ్ బోర్డ్ కనిపించే పరిస్థితి లేదు.ఆదర్శ అమ్మ పాఠశాలల నిధులతో ఈ పాఠశాలను పునరుద్ధరించడం లో భాగంగా పాఠశాల పేరు తెలిపే బోర్డు ను ప్రత్యేక వ్యయంతో రూపొందించబడింది.పోలింగ్ ప్లెక్సీ ఉండటంతో అకస్మాత్తుగా ఈ ప్లెక్సీ చూసిన వారు దివ్యాంగుల బడి అని పొరబడే అవకాశం ఉంది.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -