Sunday, July 20, 2025
E-PAPER
Homeసినిమానిజ జీవిత కథ కాదు

నిజ జీవిత కథ కాదు

- Advertisement -

పవన్‌ కళ్యాణ్‌ నటించిన చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో ఇందులో కనిపించనున్నారు. నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ.దయాకర్‌ రావు నిర్మించారు. ఈ పీరియాడికల్‌ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కష్ణ, క్రిష్‌ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్‌, బాబీ డియోల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈనెల 24న ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సమర్పకుడు ఎ.ఎం. రత్నం మీడియాతో మాట్లాడుతూ, ’17వ శతాబ్దం నేపథ్యంలో జరిగే కథ ఇది. బయట ప్రచారం జరుగుతున్నట్టుగా ఇది నిజ జీవిత కథ కాదు. ఓ కల్పిత పాత్రను తీసుకొని, దాని చుట్టూ కథ అల్లుకోవడం జరిగింది ‘ఖుషి, బంగారం’ తర్వాత పవన్‌ కళ్యాణ్‌తో చేసిన మూడో చిత్రమిది. పేరుకి మూడు సినిమాలే కానీ.. మా మధ్య 25 సంవత్సరాల అనుబంధం ఉంది. మా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా విజయవంతం అవుతుంది. అంతేకాదు పవన్‌కళ్యాణ్‌ గౌరవానికి తగ్గట్టుగా సినిమా ఉంటుంది. మా అబ్బాయి జ్యోతికష్ణ దర్శకత్వ ప్రతిభ చూసి ఆశ్చర్య పోయాను. మన చరిత్రను ముడిపెడుతూ ఈ తరానికి చేరువయ్యేలా.. ఇండియన్‌ జోన్స్‌ తరహాలో సినిమాని గొప్పగా మలిచాడు.తన పనితీరు చూసి పవన్‌ కూడా ప్రశంసించారు’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -