నవతెలంగాణ – హైదరాబాద్: తమిళ సినీ పరిశ్రమకు నిలువెత్తు చరిత్రగా నిలిచిన ఏవీయం ప్రొడక్షన్స్ స్థాపకుడు ఏ.వి. మేయప్ప చెట్టియార్ తరువాత ఆ సంస్థ బాధ్యతలు చేపట్టి దాని ప్రతిష్టను కొనసాగించిన ప్రముఖ నిర్మాత ఏవీఎం సరవణన్ 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కొంతకాలంగా చికిత్స అందుతున్నప్పటికీ, ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తమిళ సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచేసింది. 1945లో ఏ.వి. మేయప్ప చెట్టియార్ స్థాపించిన ఏవీయం ప్రొడక్షన్స్, దశాబ్దాల పాటు సౌత్ ఇండియన్ సినిమాలలో అగ్రగామిగా నిలిచింది. శివాజీ గణేశన్, ఎంజీఆర్, రజినీకాంత్, కమల్ హాసన్, విజయకాంత్, విజయ్, అజిత్, సూర్య వంటి స్టార్ హీరోలతో అనేక బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించింది. ఏవీయం బ్యానర్‌లో సినిమా చేయడం అనేది ప్రతి నటుడికి ఒక డ్రీమ్‌గా ఉండేది.
ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



