– 10న వ్యక్తిగతంగా హాజరు కావాలి :రాష్ట్ర మహిళా కమిషన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బాచుపల్లిలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని వర్షిత (వర్ష) ఆత్మహత్య ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసిన కమిషన్ విచారణ జరుపుతున్నది. ఈ నేపథ్యంలో శ్రీచైతన్య కళాశాలల చైర్ పర్సన్‌కు నోటీసు జారీ చేసింది. డిసెంబర్ 10న వ్యక్తిగతం గా హాజరు కావాలని కోరింది. వర్షిత ఘటనకు సంబంధించిన పరిస్థితు లు, కాలేజ్ తీసుకున్న చర్యలు, గత తనిఖీల తర్వాత కూడా కొనసాగుతున్న సమస్యలు, కమిషన్ సూచనల అమలు స్థితి, విద్యార్థుల భద్రత, సంక్షేమం కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న చర్యలపై వివరమైన నివేదికతో హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. గతంలో విద్యార్థుల సంక్షేమం, మానసిక ఒత్తిడి, పర్యవేక్షణ వ్యవస్థ, భద్రతా చర్యలు వంటి అంశాల్లో నిర్లక్ష్యం కొనసాగుతున్నట్టు వివిధ స్థాయిల్లో అందిన ఫిర్యాదులు కమిషన్‌కు అందాయి. ఆ నేపథ్యంలో కమిషన్ ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద నిర్వహించిన తనిఖీల తర్వాత కూడా పరిస్థితులు మెరుగుపడలేదని విచారణ సందర్భం గా కమిషన్ గుర్తించింది.
శ్రీచైతన్య కళాశాలల చైర్‌పర్సన్‌కు నోటీసు జారీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



