అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో 1,743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో వెయ్యి డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. అక్టోబరు 8 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. డ్రైవర్ పోస్టులకు 22 నుంచి 35ఏండ్లు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏండ్ల వరకు వయోపరిమితిని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరి వారికి 5 ఏండ్లు, మాజీ సైనికోద్యోగులకు మూడేండ్లు వయో పరిమితి సడలింపు ఉంటుందని తెలంగాణ పోలీస్ నియామక మండలి తెలిపింది. స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. జిల్లాల వారీగా పోస్టుల వివరాలు, జీతభత్యాలను నోటిఫికేషన్‌లో పొందుపర్చారు. పూర్తి వివరాలకు తెలంగాణ పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్‌సైట్ షషష.్‌స్త్రజూతీb.ఱఅలో సంప్రదించాలని పేర్కొన్నారు.