నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోంది. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో 704 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ద్వారా కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం అయింది.
ఇప్పటికే ఇచ్చిన 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అదనంగా మరో 704 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపింది. మెడికల్ కాలేజీలలో టీచింగ్ సమస్యలు తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆటో 44 మంది సీనియర్ ప్రొఫెసర్లకు ఏ డి ఎం ఈ లుగా ప్రమోషన్ కూడా ఇచ్చింది. 278 అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్ ఇవ్వబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.