- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ 2025- 26 విద్యా సంవత్సరానికి ఉర్దూ, బిజినెస్ మేనేజ్మెంట్, కామర్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, బాటని, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్ఫర్ మాటిక్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, సోషల్ వర్క్ మరియు లా విభాగాలలో పీహెచ్డీ ఖాళీల ప్రవేశాల కొరకు అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఏం యాదగిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అప్లికేషన్స్ 25- 9 -2025 వరకు తెలంగాణ యూనివర్సిటీ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు.
- Advertisement -