Tuesday, August 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో ఎన్ఆర్ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక..

జన్నారంలో ఎన్ఆర్ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో 15 విడిత మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకంకు సంబందించి సామాజికి తనిఖీ ప్రజావేదికను మంగళవారం ఎంపీడీవో ఉమార్ షరీఫ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు డీఆర్డీఏ పీడీ కిషన్ ముఖ్య అతిథి గా హజరయ్యారు. 2024 జనవరి నుండి 2025 మార్చి వరకు 442 రకాల పనులను చేపట్టడం జరిగిదని ఇందులో కూలీల వేతనాల కోసం రూ.72998148 చెల్లించగా మెటీరియల్ పేమెంట్ క్రింద రూ.11724629 ఖర్చు చేశారని మొత్తం ఖర్చు రూ.84722777 లని ఎస్ ఆర్ పీ లు రవి, సాయిలు తెలిపారు.

అదే విధంగా 195 పీఆర్ వర్క్స్ తో పాటు సీసీ రోడ్లు చేపట్టం జరిగిందని ఇందులో కూలీల వేతనాలకు రూ.64976 చెల్లించగా మెటీరియల్ పేమెంట్ కు రూ.55 886462 ఖర్చు చేయడం జరిగిందని వీటికి మొత్తం రూ.55951438 ఖర్చు పెట్టడం జరిగిందని సభలో తెలిపారు. ఈ పనులకు సంబంధించి గత ఐదు రోజులుగా తనిఖీ బృందం 29 గ్రామపంచాయితీల్లో కూలీల నేరుగా కలిసి వారికి అందిన వేతనాలను పరిశీలించడమే గాకుండా ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులను పరిశీలించి ప్రజా వేదికలో వెల్లడించారు. మండలంలోని లింగయ్యపల్లే, మురిమడుగు, బాదంపెల్లి, లోతొర్రే, ధర్మారం, మొర్రిగూడ, చింతగూడ, ఇందన్ పల్లి, రోటిగూడ, తిమ్మాపూర్, హస్టల్ తండా లో మొత్తం 11 గ్రామపంచాయితీల్లో రూ.13 వేల వరకు అక్రమాలు జరిగియాని సభలో తెలిపారు.

రేండ్లగూడ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ పక్షపాతంగావ్యవహరిస్తున్నారని పాత షెడ్డుకు బిల్లులు చెల్లించారని ఆయన పై చర్యలు తీసుకోవాలని అదే గ్రామానికి చెందిన దాముక కరుణాకర్, సుధాకర్ లు పీడీకి ఫిర్యాదు చేశారు. అనంతరం డీఆర్డీఏ పీడీ కిషన్ మాట్లాడుతూ ఉపాధి హమీపథకం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిందని అర్హులైన పేదలందరికి పనులు కల్పించాలని ఎదైన అక్రమాలకు పాల్పపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రేండ్లగూడ లో జరిగిన పనులను మరోసారి పరిశీలించి అవకతవకలకు పాల్పపడినట్లు విచారణలో తెలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 11 గ్రామపంచాయితీల్లో రూ.13 వేలు అక్రమాలు జరిగినట్లు గుర్తించడం జరిగిందని వీటిని అక్రమాలకు పాల్పపడ్డ ఎఫ్ఎ ల నుండి వెంటనే రికవరి చేయాలని ఈజీఎస్ ఆఫీసర్లను అదేశించారు. ఈ కార్యక్రమంలోస్టేట్ టెక్నికల్ మెంబర్ వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారయణ,మండలంలోని అన్ని గ్రామపంచాయితీల సెక్రటరీలు,టెక్నికల్ అసిస్టేంట్లు,ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -