- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సినీనటుడు ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులను భంగం కలిగించేలా సోషల్‌మీడియాలో కొందరు వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా విచారణ చేపట్టారు. 2021 ఐటీచట్టం ప్రకారం సదరు ఖాతాలపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సోషల్‌మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబరు 22కు వాయిదా వేశారు.
- Advertisement -



