Tuesday, December 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలు జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య పెంపు

 జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య పెంపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో వార్డుల సంఖ్యను రెట్టింపు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. నగర పాలన, పరిపాలన సౌలభ్యం కోసం ఈ మార్పు చేసినట్లు స్పష్టం చేసింది.

ఇటీవల జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ సమీపంలోని 27 మున్సిపాలిటీలను విలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ నేపథ్యంలో పెరిగిన జనాభా, విస్తీర్ణానికి అనుగుణంగా వార్డుల పునర్విభజన అనివార్యమైంది. ఇందులో భాగంగానే వార్డుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో జీహెచ్ఎంసీ రాజకీయ స్వరూపం పూర్తిగా మారనుంది. వార్డుల పునర్విభజన ప్రక్రియను అధికారులు త్వరలోనే ప్రారంభించనున్నారు. కొత్తగా విలీనమైన ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, అభివృద్ధి పనులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ పెంపు దోహదపడుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే కార్పొరేషన్ ఎన్నికలు 300 వార్డుల ప్రాతిపదికనే జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -