తెలంగాణ తమిళ క్యాథలిక్ సభ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సమాజానికి సేవ చేస్తున్న నన్స్‌ను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని తెలంగాణ తమిళ క్యాథలిక్ సభ తప్పు పట్టింది. ఛత్తీస్‌గఢ్‌లో చట్టవిరుద్ధంగా, అన్యాయంగా ఇద్దరు నన్స్‌ను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ క్యాథలిక్ సభ గురువారం సికింద్రాబాద్‌లో సెయింట్ మేరీ జూనియర్ కాలేజ్ నుంచి సెయింట్ థెరిసా విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించింది. నాయకులు ఆండ్రూస్ జేవియర్, మోజెస్ దాస్, ఒలంపియన్ అమల్ రాజ్, చార్లెస్ తదితర నాయకులు ర్యాలీలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఒక మతం వారిని లక్ష్యంగా చేసుకుని హింసించడం ప్రజా స్వామ్యంలో తగదని వారన్నారు. దేశంలో సెక్యులర్ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తుచేశారు.
నన్స్ అరెస్టు చట్టవిరుద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES