నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షపై సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ కీలక సమాచారాన్ని అందించారు. యెమెన్‌లో ప్రస్తుతం భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్ష నిలిపివేయబడిందని.. ప్రతికూలంగా ఏమీ జరగలేదని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనానికి కేంద్రం తరపున హాజరైన అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు. ఈ విషయంలో కొత్త మధ్యవర్తి రంగంలోకి దిగారని పేర్కొన్నారు.
నిమిషా ప్రియ 2008లో యెమెన్‌కు వెళ్లి అక్కడ నర్సుగా పనిచేసింది. తలాల్ అబ్డో సాయంతో క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. తలాల్.. నర్సును వేధించడం ప్రారంభించాడని నిమిషా న్యాయవాది చెప్పారు. తప్పించుకోవడానికి నిమిషా.. తలాల్‌కు డ్రగ్స్ ఇచ్చింది. ఇది అతని మరణానికి దారితీసింది. ఈ కేసులో ఆగస్టులో ఆమె ఉరిశిక్ష పడింది. దౌత్యం కారణంగా ప్రస్తుతం ఆమెకు ఉరిశిక్ష నిలిపివేయబడింది.