- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో బుధవారం రోజున నర్సరీ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నర్సరీలో పండ్ల మొక్కలను పెంచి రైతులకు అందించడం జరుగుతుందని తెలిపారు. మొక్కలు పెంచడం ద్వారా వర్షాలు బాగా కురవడమే కాకుండా, వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం ఇస్తారి,వార్డు సభ్యులు చౌడబోయిన అంజనేయులు,పోతారం కనకయ్య, కొత్తపల్లి రేణుక,చౌడబోయిన లావణ్య రవి,చౌడబోయిన కనకయ్య,మహేష్, పంచాయతీ కార్యదర్శి శ్రీలతతో పాటు చౌడబోయిన పరుశరాములు,రాజు పాల్గొన్నారు.
- Advertisement -



