Saturday, November 1, 2025
E-PAPER
Homeఖమ్మంగుండె సంబంధిత వ్యాధితో నర్సింగ్ విద్యార్థిని మృతి…

గుండె సంబంధిత వ్యాధితో నర్సింగ్ విద్యార్థిని మృతి…

- Advertisement -

నవతెలంగాణ – దుమ్ముగూడెం: మండల పరిధిలోని తూరుబాక గ్రామానికి చెందిన మోతుకూరి శృతి( 21) అనే నర్సింగ్ విద్యార్థిని గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. తూరుబాక గ్రామానికి చెందిన మోతుకూరి వెంకటేశ్వర్లు, సావిత్రి దంపతులకు శృతి ఏకైక సంతానం. వైద్య వృత్తిపై ఆసక్తి ఉన్న శృతి భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అప్రెంటిస్ విధానంలో పనిచేస్తుంది. గత కొంతకాలంగా శృతి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా, గుండెకు నీరు పట్టిందని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఆ విద్యార్థిని వైద్యం కోసం తీవ్రంగా శ్రమించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం నుంచి ఖమ్మం తరలించారు. అక్కడ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందుతూ శృతి మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురు చిన్న వయసులోనే మృతి చెందడంతో ఆ తల్లి, తండ్రి రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. శృతి మృతితో తూరుబాక గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -