Monday, January 12, 2026
E-PAPER
Homeనిజామాబాద్నిజామాబాద్ జిల్లా జాక్ చైర్మన్‌గా నూతపల్లి గంగాధర్

నిజామాబాద్ జిల్లా జాక్ చైర్మన్‌గా నూతపల్లి గంగాధర్

- Advertisement -


నవతెలంగాణ-కంఠేశ్వర్‌: విద్యుత్ ఉద్యోగుల ఆర్టిజన్ల కార్మికుల నిజామాబాద్ జిల్లా జాక్ చైర్మన్ అన్ని యూనియన్ల నాయకత్వ ఆమోదంతో ఏకగ్రీవంగా నూతపల్లి గంగాధర్ ఎన్నికైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసంకృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. త‌న ఎన్నిక‌కు స‌హ‌క‌రించిన అన్ని యూనియన్ల నాయకత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గత పాలకులు చేసిన నిర్వాకంతో త‌మ‌ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు అన్యాయం జరిగిన మాట నగ్న సత్యమ‌ని, ఏపీఎస్ఈ బి రోల్స్ వర్తింప చేస్తానని గత పాలకులు మొండి చేయి చూపించారని వాపోయారు. ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో త‌మ‌కు న్యాయం జరుగుతుందని పూర్తి విశ్వాసం ఉంద‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో నిజామాబాద్ రాష్ట్ర జాక్ ఛైర్మెన్ సతీష్ రెడ్డి, కన్వీనర్ సాయిలు, ఎన్‌పీడీసీఎల్ జాక్ ఛైర్మెన్ సికిందర్, కన్వీనర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -