Friday, November 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోషకాహారంతో విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం

పోషకాహారంతో విద్యార్థులకు మెరుగైన ఆరోగ్యం

- Advertisement -

– ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీలేఖ
నవతెలంగాణ – తోగుట 

పోషకాహారంతో విద్యార్థుల ఆరోగ్యం మెరుగు పడుతుందని అంగన్వాడి సూపర్వైజర్ శ్రీలేఖ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో అంగన్వా డీ కేంద్రంలో అన్నప్రాసన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. రెండు సంవత్సరాల పిల్లల నుండి ఐదు సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం తోపాటు మంచి విజ్ఞానం కలుగుతుందన్నారు. ప్రీ స్కూల్ కృత్యాలు వివిధ కార్యక్రమాలు నిర్వహిం చారు. పిల్లలతోపాటు  తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఏఎన్ఎం అనురాధ, అంగన్వాడీ టీచర్లు మాధవి, విజయ, ఆశా కార్యకర్తలు స్వేచ్ఛ, లావణ్య, కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -