Wednesday, December 3, 2025
E-PAPER
Homeసినిమాభిన్న కాన్సెప్ట్‌తో 'ఓ.. సుకుమారి'

భిన్న కాన్సెప్ట్‌తో ‘ఓ.. సుకుమారి’

- Advertisement -

హీరో తిరువీర్‌, హీరోయిన్‌ ఐశ్వర్య రాజేష్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఓ.. సుకుమారి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నూతన దర్శకుడు భరత్‌ దర్శన్‌ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్‌లో రూపొందుతన్న చిత్రమిది. బుధవారం మేకర్స్‌ ఈ చిత్రం టైటిల్‌ ‘ఓ.! సుకుమారి’ని రివీల్‌ చేశారు. ఆకట్టుకునే పోస్టర్‌ను మేకర్స్‌ ఆవిష్కరించారు. శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఝాన్సీ, మురళీధర్‌ గౌడ్‌, ఆనంద్‌, అంజిమామ, శివానంద్‌, కోట జయరామ్‌ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి డీవోపీ: కుషేందర్‌, సంగీతం: భరత్‌ మంచిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: తిరుమల ఎం తిరుపతి, ఎడిటర్‌: శ్రీ వరప్రసాద్‌, లిరిక్స్‌: పూర్ణాచారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -