డ్రగ్స్‌పై యువతకు అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు స్పందించిన హీరో కృష్ణసాయి పలు ప్రచార చిత్రాలను రూపొందిస్తున్నారు. కృష్ణ సాయి ఛారిటబుల్ ట్రస్ట్ నిర్మాణంలో ‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’ అనే సందేశంతో రూపొందించిన ప్రచార వీడియోకు మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, ‘ ‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు, మా బాధ్యతగా డ్రగ్స్‌పై ఓ చైతన్యపూరిత గీతాన్ని రూపొం దించాను. గవర్నర్లు, పోలీస్ విభాగంతో పాటు, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రతి సినిమాకి ముందు ‘స్మోకింగ్ డేంజర్’ అని హెచ్చరికలు చేసే మెసేజ్ వలన యువతలో అవగాహన కలిగడంతో సిగరెట్, తంబాకు, గుట్కా వినియోగం బాగా తగ్గిపోయింది. సినిమా మాధ్యమం వల్ల ప్రజలు ప్రభావితం అవుతారు. అందుకే ఇప్పుడు డ్రగ్స్‌పై అవగాహన పెంచేందుకు మేం రూపొందించిన పాట ‘డేంజర్’ అనే సినిమాలోనిది. ఈ సినిమా యువతను మార్పు దిశగా నడిపిస్తుందని నమ్మకం ఉంది. ఇలాంటి సామాజిక స్పహ కలిగిన చిత్రాలు, ఉద్యమాలు ముందుకు వెళ్లాలంటే మీడియా మద్దతు కీలకం, అందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలి’ అని తెలిపారు.
ఇటీవల డ్రగ్స్‌పై పాట రూపొందించిన హీరో కృష్ణసాయి అందులో నటించారు. ఈ ప్రచార చిత్రానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అప్పటి గవర్నర్లు తమిళసై, దత్తాత్రేయ, కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఐపిఎస్, ఇంటెలిజెన్స్ ఐజి సుమతి, అదనపు డీజీపీ జిహెచ్‌పి రాజు, నార్కోటిక్ బ్యూరో చీఫ్ అదనపు డిజిపి సందీప్ శాండిల్య, ఇతర ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు ఈ డ్రగ్స్ పాటను వీక్షించి హీరో కృష్ణసాయిని అభినందించారు. ఈ పాటకు సంగీతం: శంభు ప్రసాద్, దర్శకుడు, గీత రచయిత: పిఎస్ నారాయణ, సింగర్: రమణ సీలం. ఈ పాటలో కృష్ణసాయి, పూజిత, మేక రామకృష్ణ, రమేష్ గుత్తుల, నితిష్, వెంకటేశ్వరరావు తదితరులు నటించారు.
‘ఓ యువతా నీ గమ్యం ఎటు వైపు?’
- Advertisement -
- Advertisement -